Share News

Viral Video: కారు కడగడం ఓకే గానీ.. మరీ విచిత్రంగా.. నీళ్లు అలా పోయడం ఏంట్రా బాబోయ్..

ABN , Publish Date - May 17 , 2024 | 09:03 PM

చూసేందుకు అంతా మనుషులే అయినా.. ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఒకరు చేసిన పని ఇంకొంకరు చేయలేని విధంగా ఉంటుంది. అలాగే కొందరు చేసే విన్యాసాలు చూస్తే.. ఇవి మనుషులకు సాధ్యమేనా..! అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ...

Viral Video: కారు కడగడం ఓకే గానీ.. మరీ విచిత్రంగా.. నీళ్లు అలా పోయడం ఏంట్రా బాబోయ్..

చూసేందుకు అంతా మనుషులే అయినా.. ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఒకరు చేసిన పని ఇంకొంకరు చేయలేని విధంగా ఉంటుంది. అలాగే కొందరు చేసే విన్యాసాలు చూస్తే.. ఇవి మనుషులకు సాధ్యమేనా..! అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర సాహసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి చేసిన వినూత్న విన్యాసానికి సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కారు కడుగుతున్న ఓ వ్యక్తి.. చివరకు దానిపై నీళ్లు పోసే విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు కారు కడిగేందుకు (Car cleaning) రెడీ అవుతాడు. అందరిలాగానే డిజర్జంట్ కలిపిన నీటిలో గుడ్డను ముంచి కారు ఇంజిన్ భాగాన్ని తుడుస్తాడు. ముందు వైపు మొత్తం నురగతో రఫ్ చేస్తాడు. తర్వాత యధావిధిగా దానిపై నీళ్లు కొడితే నురగ మొత్తం పోయి కారు శుభ్రం అవుతుంది.

Viral Video: ఇదెక్కడి క్రియేటివిటీరా నాయనా..! బియ్యం బస్తాపై ఇలాంటి ప్రయోగం కూడా చేయొచ్చా..


అయితే ఇక్కడే ఆ యువకుడు తన టాలెంట్‌ని ప్రదర్శించాడు. అందరిలా పైపుతో నీళ్లు కొడితే ఏం కిక్కు ఉంటుంది.. అని అనుకున్నాడో ఏమో గానీ.. తన నోటినే నీళ్ల పైపులా మార్చేశాడు. ఉన్నట్టుండి నోరు తెరవడంతో లోపలి నుంచి నీళ్లు పొంగుకుంటూ బయటికి వచ్చాయి. పైపుతో నీళ్లు పడితే ఎలా ఉంటుందో.. అచ్చం అలాగే నోటి నుంచి నీళ్లు వచ్చాయి. ఇలా నోటి సాయంతోనే కారు ఇంజిన్‌పై నీటిని కొట్టి శుభ్రం చేశాడు.

Viral Video: విదేశీ యువతికి షాకింగ్ అనుభవం.. జనాల మధ్యలో ఓ వ్యక్తి లాగి మరీ..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! ఈ యువకుడి టాలెంట్.. మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అది నోరా.. లేక నీటి కొళాయా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎంత పెళ్లి అయితే మాత్రం మరీ ఇదేంటీ.. ఈ వరుడి డాన్స్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - May 17 , 2024 | 09:03 PM