Share News

Viral Video: డ్యాన్సర్ పైశాచికత్వం.. వేదికపై కోడిని పట్టుకుని..!

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:58 PM

కొందరు మనుషి రూపంలో ఉన్నా వారి ప్రవర్తన మాత్రం జంతువుల కంటే హీనంగా ఉంటుంది. చాలా మంది చిన్న పిల్లలు, వృద్ధులపై దాడులు చేస్తూ పైశాసిక ఆనందాన్ని పొందుతుంటే... మరికొందరు ...

Viral Video: డ్యాన్సర్ పైశాచికత్వం.. వేదికపై కోడిని పట్టుకుని..!

కొందరు మనుషి రూపంలో ఉన్నా వారి ప్రవర్తన మాత్రం జంతువుల కంటే హీనంగా ఉంటుంది. చాలా మంది చిన్న పిల్లలు, వృద్ధులపై దాడులు చేస్తూ పైశాసిక ఆనందాన్ని పొందుతుంటే... మరికొందరు జంతువులను హింసిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ డాన్సర్ వేదికపై కోడిని పట్టుకుని చేసిన నిర్వాకం చూసి అంతా మండిపడుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) అనకాపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా జరుగుతున్న ఓ ఫంక్షన్‌లో డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్యాన్స్ ట్రూప్ (Dance troupe) సభ్యులు వేదికపై వివిధ రకాల పాటలకు డాన్సులు చేస్తూ అందరినీ ఆలరిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Viral Video: మొసళ్ల సరస్సులోకి బైక్‌తో దూసుకెళ్లిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


ఎర్ర చీర కట్టుకున్న ఓ వ్యక్తి గ్రూపు మధ్యలో డాన్స్ వేస్తూ ఉన్నట్టుండి కోడిని చేతిలోకి తీసుకుంటాడు. అంతా చూస్తుండగానే దాని (dancer bites hens head) తలను నోటితో కొరికి పక్కన పడేస్తాడు. అంతటితో ఆగని అతను కోడి రక్తాన్ని కూడా నోటిలోకి పీల్చుకుని గాల్లోకి స్ప్రే చేస్తాడు. ఇతడి వికృత చేష్టలు చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral: భార్య నిర్లక్ష్యం చేస్తుండడంతో అనుమానం వచ్చిన భర్త.. పాడుబడ్డ ఇంట్లోకి డ్రోన్ కెమెరా పంపగా..


ఈ విషయం చివరకు పోలీసుల వరకూ వెళ్లడంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి శాడిస్టులపై చర్యలు తీసుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘జంతువులు, పక్షులను హింసించడం నేరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: సింహాలను మేతకు తోలుకెళ్లిన వ్యక్తి.. చివరకు అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్న జనం..

Updated Date - Jul 19 , 2024 | 05:26 PM