Share News

Viral Video: విసిగిస్తోందని కాకిని కట్టేశాడు.. కాసేపటి తర్వాత దిమ్మతిరిగే సీన్..

ABN , Publish Date - Jul 18 , 2024 | 08:12 PM

మనుషుల్లో కానరాని ఐకమత్యాన్ని జంతువుల్లో చూస్తూ ఉంటాం. సాటి మనిషి కష్టాల్లో ఉంటే కనీసం కనికరం చూపని ప్రస్తుత సమాజంలో మనుషుకంటే జంతువులు ఎంతో మేలని అనిపిస్తుంటుంది. ఒక జంతువుకు ఇబ్బంది ఎదురైతే ...

Viral Video: విసిగిస్తోందని కాకిని కట్టేశాడు.. కాసేపటి తర్వాత దిమ్మతిరిగే సీన్..

మనుషుల్లో కానరాని ఐకమత్యాన్ని జంతువుల్లో చూస్తూ ఉంటాం. సాటి మనిషి కష్టాల్లో ఉంటే కనీసం కనికరం చూపని ప్రస్తుత సమాజంలో మనుషుకంటే జంతువులు ఎంతో మేలని అనిపిస్తుంటుంది. ఒక జంతువుకు ఇబ్బంది ఎదురైతే మిగతా జంతువులన్నీ సాయం చేయడానికి వస్తుంటాయి. అలాగే పక్షులు కూడా తోటి పక్షులకు సాయం చేయడాన్ని చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. విసిగిస్తోందనే కోపంతో ఓ వ్యక్తి కాకిని తన దుకాణం ముందు కట్టేశాడు. అయితే కాసేపటి తర్వాత షాపుపై అతడికి దిమ్మతిరిగే సీన్ కనిపించింది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District) తాటిపాక డైలీ మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ చికెన్ షాపు వద్ద ఓ కాకి పదే పదే వాలుతూ.. కావ్.. కావ్.. అంటూ శబ్ధాలు చేస్తోంది. దీంతో దుకాణ యజమానికి కోపం కట్టలు తెంచుకుంది. ఎంత అదిలించినా మళ్లీ మళ్లీ వస్తుండడంతో (shop owner tied the crow) చివరకు దాన్ని తాడుతో కట్టేశాడు.

Viral Video: పందిపై పులి దాడి.. మధ్యలో ఎంటరైన భారీ మొసలి.. చివరకు..


కాకిని తాడుతో కట్టేయడంతో అది మరింత గట్టిగా అరవడం మొదలెట్టింది. కాకి ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న మిగతా కాకులన్నీ అక్కడికి చేరుకున్నాయి. దుకాణానికి పైన చుట్టూ తిరుగుతూ కావ్.. కావ్.. అంటూ అన్నీ కలిసి అరవడం మొదలెట్టాయి. దీంతో దుకాణ యజమాని భయంతో లోపలికి వెళ్లిపోయాడు. ఆ కాకులన్నీ అక్కడే తిరుగుతూ అరుస్తుండడంతో అతడికి విషయం అర్థమై.. చివరకు కట్టేసిన కాకిని వదిలేశాడు.

Viral Video: నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తి.. అంతా వేడుక చూస్తుండగా.. చివరకు ఎవరూ ఊహించని విధంగా..


దీంతో కాసేపటికి అక్కడున్న కాకులన్నీ వెళ్లిపోయాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కాకుల్లో ఉన్న ఐకమత్యం మనుషుల్లో లేదు’’.. అంటూ కొందరు, ‘‘కాకుల పవర్ అంటే అలా ఉంటుంది మరి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.70లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వర్షంలో రీల్ చేయాలని ఉత్సాహంగా వెళ్లాడు.. కెమెరా ఆన్ చేసి డాన్స్ చేస్తుండగా..

Updated Date - Jul 18 , 2024 | 08:12 PM