Share News

Viral Video: వామ్మో..! గాడిదలో ఇంత ఆవేశమా.. దాడి చేయాలని చూసిన హైనాను..

ABN , Publish Date - May 19 , 2024 | 04:03 PM

చూసేందుకు సైలెంట్‌గా ఉన్నాయని అనవసరంగా కెలికితే చివరకు అసలుకే ఎసరు వస్తుంది. ఇది జంతువుల విషయంలో తరచూ జరుగుతూ ఉంటుంది. సైలెంట్‌గా ఉన్నాయని కొందరు జంతువులతో తమాషా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి..

Viral Video: వామ్మో..! గాడిదలో ఇంత ఆవేశమా.. దాడి చేయాలని చూసిన హైనాను..

చూసేందుకు సైలెంట్‌గా ఉన్నాయని అనవసరంగా కెలికితే చివరకు అసలుకే ఎసరు వస్తుంది. ఇది జంతువుల విషయంలో తరచూ జరుగుతూ ఉంటుంది. సైలెంట్‌గా ఉన్నాయని కొందరు జంతువులతో తమాషా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ గాడిదతో పెట్టుకున్న హైనా వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘వామ్మో..! గాడిదలో ఇంత ఆవేశం ఎప్పుడూ చూడలేదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తన మానాన తాను మేత మేస్తున్న గాడిద వద్దకు ఓ హైనా వస్తుంది. గాడిదను టార్గెట్ చేసిన హైనా.. ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేస్తుంది. దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా (Hyena attack on donkey) దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. హైనా దాడి చేయడంతో గాడిద వెంటనే అప్రమత్తమై ఎదురుదాడి చేస్తుంది. పట్టరాని కోపంతో హైనాపై విచక్షణా రహితంగా దాడి చేస్తుంది. తర్వాత హైనా మెడను కొరికి పట్టుకుని అటూ, ఇటూ తిప్పుతూ నేలకేసి కొడుతుంది. గాడిద పట్టు నుంచి హైనా తప్పించుకోలేక విలవిల్లాడిపోతుంది.

Viral Video: ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే.. దగ్గరికెళ్లి చూస్తే దిమ్మతిరిగే సీన్..!


హైనా ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా.. గాడిద మాత్రం వదలకుండా గట్టిగా పట్టుకుని కొరికేస్తుంది. చూస్తుంటే ఈ దాడిలో హైనా ప్రాణాలు కోల్పోయినట్లు కనిపిస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ గాడిద పవర్.. మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘హైనాకు చుక్కలు చూపించిన గాడిద’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: స్నేహితురాలి పెళ్లిలో యువకుడి నిర్వాకం.. వధువుకు గిఫ్ట్ ఇచ్చినట్లు ఇస్తూనే ..

Updated Date - May 19 , 2024 | 04:03 PM

News Hub