Share News

Viral Video: స్నేహితురాలి పెళ్లిలో యువకుడి నిర్వాకం.. వధువుకు గిఫ్ట్ ఇచ్చినట్లు ఇస్తూనే ..

ABN , Publish Date - May 19 , 2024 | 03:01 PM

వివాహ కార్యక్రమాల్లో సరదా సంఘటనలతో పాటూ కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. కొందరు వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కావాలని ప్లాన్ చేస్తుంటారు. మరికొందరు ఎదుటి వారిపై కోపంతో కావాలనే గొడవ చేస్తుంటారు. ఇలాంటి...

Viral Video: స్నేహితురాలి పెళ్లిలో యువకుడి నిర్వాకం.. వధువుకు గిఫ్ట్ ఇచ్చినట్లు ఇస్తూనే ..

వివాహ కార్యక్రమాల్లో సరదా సంఘటనలతో పాటూ కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. కొందరు వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కావాలని ప్లాన్ చేస్తుంటారు. మరికొందరు ఎదుటి వారిపై కోపంతో కావాలనే గొడవ చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. స్నేహితురాలి పెళ్లికి హాజరైన యువకుడు.. వధువుకు గిఫ్ట్ ఇచ్చినట్లే ఇచ్చి చివరకు దారుణానికి పాల్పడ్డాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని (Rajasthan) చిత్తోర్‌గఢ్ జిల్లాలో రష్మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఉంచ గ్రామంలో ఇటీవల ఓ వివాహం (marriage) జరిగింది. వివాహం సందర్భంగా వధూవరులు (bride and groom) వేదికపై ఉండగా.. బంధువులంతా గిఫ్ట్‌లు అందించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు అందరితో పాటూ వేదికపైకి వెళ్లాడు. వధువుకు గిఫ్ట్ అందించి ఫొటోలకు పోజులు కూడా ఇచ్చాడు.

Viral Video: ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే.. దగ్గరికెళ్లి చూస్తే దిమ్మతిరిగే సీన్..!


కొద్ది సేపు వధువు పక్కనే నిలబడిన అతను.. తర్వాత వరుడి వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు నటిస్తూ.. ఒక్కసారిగా చేతిలోని కత్తితో (man attacked the groom) అతడిపై దాడికి దిగాడు. కత్తితో ఎడాపెడా తలపై పొడిచేశాడు. ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే అతను పరారయ్యాడు. విచారణలో ఆ యువకుడు.. వధువుతో పాటూ ఒకే పాఠశాలలో టీచర్‌గా పని చేశాడని తెలిసింది. రెండేళ్ల పాటు ఇద్దరూ ఒకే పాఠశాలలో పని చేశారని, ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో దూరంగా ఉంటున్నారట.

Viral: భూమి లోపలి నుంచి వింత శబ్ధాలు.. పోలీసులకు అనుమానం వచ్చి.. తవ్వి చూడగా షాకింగ్ సీన్..


వధువు వేరే యువకుడిని వివాహం చేసుకోవడం ఇష్టం లేకనే.. ఇలాంటి దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. అయితే వరుడు తలపాగా పెట్టుకోవడంతో కత్తి పోట్లు తగల్లేదని, స్వల్పగాయాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం..! ఎంత దారుణం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: మహిళను చూడగానే ఎలుగుబంటి ఇలా చేసిందేంటీ.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - May 19 , 2024 | 03:09 PM