Share News

Viral Video: మూడు పెగ్గులేసిన అంకుల్.. అద్దం ముందు చేసిన నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Sep 10 , 2024 | 09:09 PM

మందుబాబుల ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు ఫుల్‌గా మందు కొట్టి ఏం చేస్తు్న్నారో.. వారికే తెలీనంతగా ప్రవర్తిస్తుంటారు. మద్యం మత్తులో రోడ్డుపై మురుగునీటిలో పడుకునేవారు కొందరైతే.. మరికొందరు జనాల మధ్యలో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. అలాగే ఇంకొందరు ...

Viral Video: మూడు పెగ్గులేసిన అంకుల్.. అద్దం ముందు చేసిన నిర్వాకం చూస్తే..

మందుబాబుల ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు ఫుల్‌గా మందు కొట్టి ఏం చేస్తు్న్నారో.. వారికే తెలీనంతగా ప్రవర్తిస్తుంటారు. మద్యం మత్తులో రోడ్డుపై మురుగునీటిలో పడుకునేవారు కొందరైతే.. మరికొందరు జనాల మధ్యలో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. అలాగే ఇంకొందరు ఏకంగా క్రూరమృగాలతోనే ఆటలాడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందుకొట్టి.. అద్దం ముందుకు వెళ్లి విచిత్రంగా ప్రవర్తించాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వృద్ధుడు (drunken old man) తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లాడు. అక్కడ అంతా మందు తాగుతూ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో సదరు వృద్ధుడు బాగా తాగాడు. దీంతో అతడికి మత్తు కూడా బాగా ఎక్కింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. పార్టీలోంచి బయటికి వెళ్లే క్రమంలో అతను ఓ అద్దం (mirror) ముందు ఆగుతాడు.

Viral Video: ఈ దొంగ తెలివి మామూలుగా లేదుగా.. తాళం తీయకుండానే లాకప్ నుంచి ఎలా వచ్చేశాడో చూడండి..


అయితే అద్దంలో తనని తాను చూసుకుని వేరే వ్యక్తిగా భావిస్తాడు. అతను పక్కకు తప్పుకొంటే వెళ్లిపోవాలని చూస్తూ ఉంటాడు. అయితే అతను ఎటు వైపు తిరిగితే.. అద్దంలో ప్రతిబింబం కూడా అలాగే తిరుగుతుండడంతో వృద్ధుడు తికమకపడతాడు. ఎదురుగా నిల్చున్న వ్యక్తి.. తనను ఆటపట్టిస్తున్నాడేమో అనుకుని తన ప్రతిబింబంపై తానే సీరియస్ అవుతాడు. ‘‘నువ్వు పక్కకు తప్పుకొంటే.. నేను వెళ్లిపోవాలి’’.. అంటూ తన ప్రతిబింబంపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత వెళ్లాలని చూడగా.. మళ్లీ తన ప్రతిబింబం కూడా అలాగే కదలడంతో అవాక్కవుతాడు.

Viral Video: వావ్.. టైరుకు గాలి నింపే కొత్త టెక్నిక్.. మరీ ఎంత సింపుల్‌గా చేశాడంటే..


ఇలా అతను చాలా సేపు అద్దం ముందు నిలబడి విచిత్రంగా ప్రవర్తిస్తూనే ఉంటాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారు పగలబడి నవ్వుకున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మందు కొడితే మామూలుగా ఉండదు మరి’’.. అంటూ కొందరు, ‘‘ఈ అంకుల్ మరీ విచిత్రంగా అనిపిస్తున్నాడే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 10 , 2024 | 09:09 PM