Share News

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

ABN , Publish Date - Sep 10 , 2024 | 04:17 PM

ప్రస్తుతం చాలా మంది అనేక రకాల పనులకు సోలార్ విద్యుత్ వినియోగించడం సర్వసాధారణమైంది. చివరకు తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి, తద్వారా ఇంటి అవసరాలన్నింటికీ ఇదే విద్యుత్ వాడుతున్నారు. చివరకు రైతులు కూడా వ్యవసాయ పనులకు సోలార్ విద్యుత్ వాడడం చూస్తుంటాం. ఇలాంటి..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

ప్రస్తుతం చాలా మంది అనేక రకాల పనులకు సోలార్ విద్యుత్ వినియోగించడం సర్వసాధారణమైంది. చివరకు తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి, తద్వారా ఇంటి అవసరాలన్నింటికీ ఇదే విద్యుత్ వాడుతున్నారు. చివరకు రైతులు కూడా వ్యవసాయ పనులకు సోలార్ విద్యుత్ వాడడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి సోలార్ విద్యుత్‌ను వినూత్నంగా వాడడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైతులు తమ వ్యవసాయ అవసరాలకు సోలార్ విద్యుత్ (Solar electricity) వాడడం చూస్తుంటాం. అయితే ఓ యువకుడు ఇదే సోలార్ విద్యుత్‌ను వినూత్నంగా, విచిత్రంగా వినియోగించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. వరి నాట్లు వేస్తున్న ఓ యువకుడు సోలార్ సాయం తీసుకున్నాడు. పని చేస్తున్న సమయంలో అలసిపోకుండా ఉండేందుకు వినూత్నమైన ఏర్పాట్లు చేసుకున్నాడు.

Optical illusion: ఇక్కడున్న ‘‘राज’’ మధ్యలో ‘‘काज’’ ఎక్కడుందో.. 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


తన వీపుపై సోలార్ ప్యానెల్ కట్టుకుని, దానికి ఓ ఇనుప రాడ్ సాయంతో తలకు ముందు వైపు ఓ ఫ్యాన్ (Solar fan) ఫిట్ చేశాడు. సోలార్ ప్యానెల్ నుంచి ఫ్యాన్‌కు కనెక్షన్ ఇచ్చి, తద్వారా అది తిరిగేలా ఏర్పాట్లు చేశాడు. ఫైనల్‌గా సోలార్ ప్యానెల్‌ను వీపుపై కట్టుకుని, వరి పొలంలోకి దిగేశాడు. వరి నాట్లు వేసే సమయంలో తలకు ఎదురుగా ఫ్యాన్ తిరుగుతుండడం వల్ల చెమట కూడా పట్టకుండా పనిని పూర్తి చేశాడన్నమాట.

Viral Video: అలలతో ఆడుకోవడం ఎప్పుడైనా చూశారా.. సముద్రంలో వీరిద్దరి నిర్వాకం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ఇతడి విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘సోలార్ ప్యానెల్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 32వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 10 , 2024 | 04:17 PM