Share News

Viral Video: వావ్.. టైరుకు గాలి నింపే కొత్త టెక్నిక్.. మరీ ఎంత సింపుల్‌గా చేశాడంటే..

ABN , Publish Date - Sep 10 , 2024 | 08:02 PM

బైకులతో వింత వింత ప్రయోగాలు చేయడం చూస్తూనే ఉంటాం. కొందరు పాత బైకులను సరికొత్తగా మార్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే.. మరికొందరు బైకు చక్రాల స్థానంలో ట్రాక్టర్ చక్రాలను అమర్చి అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. అలాగే ఇంకొందరు బైకును ఆటోల్లా మార్చి నెట్టింట ఫేమస్ అవుతుంటారు. ఇలాంటి...

Viral Video: వావ్.. టైరుకు గాలి నింపే కొత్త టెక్నిక్.. మరీ ఎంత సింపుల్‌గా చేశాడంటే..

బైకులతో వింత వింత ప్రయోగాలు చేయడం చూస్తూనే ఉంటాం. కొందరు పాత బైకులను సరికొత్తగా మార్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే.. మరికొందరు బైకు చక్రాల స్థానంలో ట్రాక్టర్ చక్రాలను అమర్చి అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. అలాగే ఇంకొందరు బైకును ఆటోల్లా మార్చి నెట్టింట ఫేమస్ అవుతుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి బైకు టైరుకు వినూత్న పద్ధతిలో గాలి నింపడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన బైకు టైరుకు (bike tire) గాలిని వినూత్న రీతిలో (Innovative air filling) నింపేశాడు. ఇందుకోసం కేవలం చిన్న పైపు ముక్కను మాత్రమే వాడాడు. వెనుక టైరుకు గాలి పోవడంతో రోడ్డు పక్కన ఆపాడు. తర్వాత తన వద్ద ఉన్న పైపు ఒక వైపు భాగాన్ని టైరుకు, మరో వైపు భాగాన్ని సైలెన్సర్‌కు అమర్చాడు.

Viral Video: తన మానాన తాను బండి తోసుకుంటూ వస్తుండగా.. మధ్యలో తోపుడు బండి ఎంత పని చేసిందో చూడండి..


ఇలా పైపును అమర్చిన తర్వాత బైకును స్టార్ట్ చేసి ఎక్సలేటర్ రైజ్ చేశాడు. బండి రైజ్ అయ్యే కొద్దీ సైలెన్సర్ నుంచి వచ్చే గాలి పైను గుండా టైరులోకి వెళ్లింది. ఇలా చూస్తుండగానే బైకు టైరులో గాలితో నిండిపోతుంది. బైకు టైరుకు గాలిని ఎంతో సింపుల్‌గా నింపేశాడు. ఇతడి విచిత్ర ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘అరేరే.. భలే విచిత్రంగా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 10 , 2024 | 08:04 PM