Viral Video: వామ్మో! ఇదేందయ్యా... ఇదీ.. ఈ వీడియో చూస్తే ఎవరైనా న్యూడిల్స్ తింటారా.. !
ABN , Publish Date - Jan 04 , 2024 | 09:26 PM
ప్రస్తుత యువత పాస్ట్ ఫుడ్‌కు పూర్తిగా అలవాటు పడ్డారు. పిజ్జాలు, బర్గర్లు, న్యూడిల్స్ తదితరాలకు ఎడిక్ట్ అవుతున్నారు. ఇక న్యూడిల్స్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వయసులో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుంటూ మరీ తింటుంటారు. అయితే..
ప్రస్తుత యువత పాస్ట్ ఫుడ్‌కు పూర్తిగా అలవాటు పడ్డారు. పిజ్జాలు, బర్గర్లు, న్యూడిల్స్ తదితరాలకు ఎడిక్ట్ అవుతున్నారు. ఇక న్యూడిల్స్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వయసులో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుంటూ మరీ తింటుంటారు. అయితే కొన్నిసార్లు కొందరు వ్యాపారులు చేసే పనులు చూస్తే.. ఇలాంటి ఆహార పదార్థాలు తినాలంటేనే భయమేస్తూ ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే ఓ వ్యక్తి న్యూడిల్స్ చేసే విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చిరు వ్యాపారి నది ఒడ్డున న్యూడిల్స్ చేసేందుకు సిద్ధమవుతాడు. నది పక్కనే కూర్చుని న్యూడిల్స్ (Noodles) తింటుంటే ఎంతో బాగుంటుందని చాలా మంది అక్కడికి వెళ్లారు. అయితే అతను న్యూడిల్స్ చేసే విధానం చూసి ఖంగుతిన్నారు. న్యూడిల్స్ చేసే ముందు ఎవరైనా శుభ్రం చేస్తారు. కానీ ఇతను శుభ్రం చేసిన విధానమే జనానికి వాంతికి వచ్చేలా చేస్తోంది. న్యూడిల్స్‌ని ప్లాస్టిక్ బకెట్లో వేసుకున్న అతను.. ఎంచక్కా.. నదిలోకి వెళ్లి, ఆ మురికి నీటిలోనే పదే పదే నీటిలో ముంచుతూ శుభ్రం చేస్తాడు.
Viral: చైనీయులు బలంగా నమ్మే ఈ వస్తువులను మీ ఇంట్లో పెట్టుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా..
శుభ్రం చేయాల్సిన న్యూడిల్స్‌ను.. అందుకు విరుద్ధంగా అపరిశుభ్రం చేయడం చూసి అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు. ‘‘ఈ న్యూడిల్స్ మాకొద్దురా నాయనా’’.. అంటూ పరుగులు పెట్టారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇవి వెరీ స్పెషల్ న్యూడిల్స్ అన్నమాట’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో! ఇకపై న్యూడిల్స్ తినాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలేమో’’.. అంటూ మరికొందరు, ‘‘ప్రవహించే నీరు కాబట్టి.. ప్రాబ్లెమ్ ఏమీ లేదు’’.. అంటూ ఇంకొందరు, అలాగే చాలా మంది ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.