Share News

Viral Video: వామ్మో.. ఏనుగుకు తిక్కరేగితే ఇలా ఉంటుందా.. ఆహారం తినిపించాలని చూడగానే..

ABN , Publish Date - Sep 20 , 2024 | 07:40 PM

ఏనుగులు చూసేందుకు ఎంతో గంభీరంగా కనింపించినా కూడా అంతే ప్రశాంతంగా ఉంటాయి. అయితే వాటికి తిక్కరేగితే మాత్రం అదే స్థాయిలో బీభత్సం సృష్టిస్తుంటాయి. పెద్ద పెద్ద వృక్షాలను సైతం పెకలించే ఏనుగులు చూశాం, వాహనాలను సైతం విసిరికొట్టే జంతువులను కూడా చూశాం. ఇలాంటి..

Viral Video: వామ్మో.. ఏనుగుకు తిక్కరేగితే ఇలా ఉంటుందా.. ఆహారం తినిపించాలని చూడగానే..

ఏనుగులు చూసేందుకు ఎంతో గంభీరంగా కనింపించినా కూడా అంతే ప్రశాంతంగా ఉంటాయి. అయితే వాటికి తిక్కరేగితే మాత్రం అదే స్థాయిలో బీభత్సం సృష్టిస్తుంటాయి. పెద్ద పెద్ద వృక్షాలను సైతం పెకలించే ఏనుగులు చూశాం, వాహనాలను సైతం విసిరికొట్టే జంతువులను కూడా చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ఏనుగు నిర్వాకానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఏనుగుకు ఆహారం తినిపిస్తుండగా.. ఒక్కసారిగా అది చేసిన పని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ ఏనుగుకు ఓ వ్యక్తి ఆహారం (young man tried to feed an elephant) తినిపించేందుకు సిద్ధమవుతాడు. చేతిలో ఆహార పదార్థం పట్టుకుని ఏనుగు వద్దకు వెళ్తాడు. ఏనుగు కూడా అతను ఏదో పెడుతున్నాడని అర్థం చేసుకుని నోరు తెరుస్తుంది. అయితే ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.ఆ వ్యక్తి ఏనుగు నోట్లో ఆహారం పెట్టగానే నోరు గట్టిగా మూసేస్తుంది.

Viral Video: వీళ్లు పిల్లలు కదా పిడుగులే.. కొండచిలువతో ఏం చేస్తున్నారో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


అతడి చేయిని గట్టిగా పట్టుకోవడంతో (elephant threw the young man) పాటూ పైకి లేపి అటూ, ఇటూ తిప్పుతుంది. ఈ క్రమంలో ఏనుగు నోటిలో నుంచి అతడు చేయి జారిపోవడంతో ధబేల్‌మని కిందపడిపోతాడు. కిందపడ్డ అతను వెంటనే అలెర్ట్ అయిపోయి దూరంగా జరిగిపోతాడు. అదే సమయంలో మరో వ్యక్తి అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి యువకుడిని దూరంగా తీసుకెళ్తాడు. ఏనుగు నోటి నుంచి చేయి జారిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.. లేదంటే అతడి ప్రాణాలకే ముప్పు వాటిళ్లి ఉండేది. అయితే ఎట్టకేలకు యువకుడు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: కట్టేసి ఉన్న దూడ దగ్గరికి కోబ్రా ఎంట్రీ.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే.. షాకవ్వాల్సిందే..


గతంలో కేరళలో ఓ ఏనుగు మావటిని ఘోరంగా అంతమొందించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వీడియో కూడా అప్పట్లో నెట్టింట తెగ వైరల్ అయింది. కాగా, యువకుడిని దూరంగా విసిరికొట్టిన ఏనుగు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలీదు.. అందుకే ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి టైం బాగుంది.. ఏమీ కాలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: విద్యార్థులు క్లాస్‌ రూమ్‌లో ఉండగా ఊహించని ఘటన.. గోడ పైకి చూడగా షాకింగ్ సీన్.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 20 , 2024 | 07:40 PM