Share News

Viral Video: విద్యార్థులు క్లాస్‌ రూమ్‌లో ఉండగా ఊహించని ఘటన.. గోడ పైకి చూడగా షాకింగ్ సీన్.. చివరకు..

ABN , Publish Date - Sep 20 , 2024 | 03:52 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. విద్యార్థులంతా క్లాస్ రూమ్‌లో పాఠాలను వింటున్నారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూమ్‌లోని గోడపై..

Viral Video: విద్యార్థులు క్లాస్‌ రూమ్‌లో ఉండగా ఊహించని ఘటన.. గోడ పైకి చూడగా షాకింగ్ సీన్.. చివరకు..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో ఊహించని ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఊహించని ప్రదేశాల్లో అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. విద్యార్థులు క్లా్స్ రూమ్‌లో ఉండగా ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. పాఠాలు వింటున్న విద్యార్థులు.. ఉన్నట్టుండి గోడ పైకి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడా అమిటీ యూనివర్శిటీ క్లాస్ రూమ్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులంతా క్లాస్ రూమ్‌లో పాఠాలను వింటున్నారు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూమ్‌లోని గోడపై ఏసీ వెంటిలేషన్‌ (snake came out from the AC ventilation) నుంచి ఉన్నట్టుండి ఓ పాము బయటికి వచ్చింది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న కప్పను గుర్తించి.. మీ కంటి చూపు ఎలా ఉందో పరీక్షించుకోండి..


పాము తల బయటికి పెట్టి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించడం చూసి విద్యార్థులంతా షాక్ అయ్యారు. విద్యార్థులంతా భయంతో కేకలు వేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాక అంతా కంగారుపడ్డారు. చాలా మంది విద్యార్థులు పామును ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. చాలా సేపు అక్కడే ఉన్న పాము.. ఆ తర్వాత మళ్లీ ఏసీ వెంటిలేషన్‌‌లోకి వెళ్లిపోయింది. వర్షాల కారణంగా పాములు ఇలా పొడి ప్రదేశాల్లోకి చొరబడుతున్నాయని తెలిసింది.

Viral Video: చంటి పిల్లాడిలా యువతి పైకి ఎక్కిన కోతి.. చివరకు ఏం చేసిందో చూస్తే.. అవాక్కవుతారు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాము కూడా పాఠాలు వినేందుకు వచ్చిందేమో’’.. అంటూ కొందరు, ‘‘ఇది న్యూ అడ్మిషన్‌లా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 62 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బలమైన గాలికి పడిపోతున్న ట్రక్కు.. గమనించిన డ్రైవర్ చివరకు ఎవరూ ఊహించని విధంగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 20 , 2024 | 03:52 PM