Viral Video: ఛీ.. ఛీ.. యవ్వనంగా కనిపించేందుకు ఈమేంటీ ఇలా చేసిందీ.. ముఖానికి ఏం రాసుకుందో తెలిస్తే..
ABN , Publish Date - Aug 13 , 2024 | 07:41 PM
ప్రస్తుత యువత ఫిట్‌గా ఉండడంతో పాటూ అందంగా కనిపించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. యువతీయువకులు పోటీపడి మరీ తమ అందానికి మెరుగులు దిద్దుకుంటుంటారు. ఈ క్రమంలో కొందరు యువతులు ముఖానికి ఏవేవో రాస్తుంటారు. మొఖంపై..
ప్రస్తుత యువత ఫిట్‌గా ఉండడంతో పాటూ అందంగా కనిపించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. యువతీయువకులు పోటీపడి మరీ తమ అందానికి మెరుగులు దిద్దుకుంటుంటారు. ఈ క్రమంలో కొందరు యువతులు ముఖానికి ఏవేవో రాస్తుంటారు. మొఖంపై ఏ చిన్న మొటిమ కానీ, మచ్చ కానీ వచ్చినా భరించలేరు. వెంటనే వాటిని దూరం చేసుకునేందుకు కంటికి కనిపించే క్రీములన్నీ పూసేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ యువతి యవ్వనంగా కనిపించేందుకు వింత ప్రయోగం చేసింది. ఆమె ముఖానికి రాసుకున్నదేంటో తెలుసుకుని నెటిజన్లు అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బ్రెజిలియన్ యువతి (Brazilian young woman) తాను యవ్వనంగా కనిపించేందుకు అందరిలా కాకుండా.. ఎవరూ చేయని ప్రయోగం చేసింది. ఆమె వేసుకున్న ఫేస్ ప్యాక్ ఏంటో తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. క్రీములకు బదులుగా (young woman smeared poop on her face) ఆమె తన మలాన్ని ముఖానికి రాసుకుంది. సదరు యువతి మలాన్ని ఓ చిన్న ప్లాస్టిక్ బాటిల్‌లో నింపి ఫ్రిడ్జిలో నిల్వ చేసింది.
Viral Video: బైకును కారులా మార్చేశాడుగా.. వీడియో చూసిన నెటిజన్లు ఏమంటున్నారంటే..
తర్వాత దాన్ని బయటికి తీసి, చేతిలోకి కొంచెం తీసుకుని ముఖంపై రాసుకుంది. ఫేస్ మొత్తం మలాన్ని రుద్దుకున్న తర్వాత కొద్ది సేపు ఆరబెట్టుకుంది. ఈ క్రమంలో ఆమె వాసన రాకుండా ఉండేందుకు ముక్కకు క్లిప్ తగిలించుకుంది. ఇలా చాల సేపటి తర్వాత ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకుంది. చివరగా తన ముఖం చూపిస్తూ .. తన చర్మం ఎంతో యవ్వనంగా మారిందని చెబుతుంది.
Viral Video: హాయిగా పడుకుందామని వెళ్లాడు.. మంచం కింద నుంచి శబ్ధాలు రావడంతో.. పరుపు తీసి చూడగా..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. వ్యర్థం విషపూరితమైనది’’.. అంటూ కొందరు, ‘‘ఇది కేవలం వ్యూస్ కోసం చేసినట్లుగా అనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలా చేయడం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతాయి.. ఎవరూ ఇలా ప్రయత్నించవద్దు’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.