Share News

Viral Video: కారు ఢీకొట్టే సమయంలో.. కొడుకును ఎలా కాపాడుకున్నాడో చూడండి..

ABN , Publish Date - Jan 26 , 2024 | 07:26 PM

కొన్నిసార్లు కొన్ని ప్రమాదాలు ఊహించని విధంగా జరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంటుంది. అయితే మరికొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా వెంట్రుకవాసిలో తప్పిపోతుంటాయి. ఇలాంటి...

Viral Video: కారు ఢీకొట్టే సమయంలో.. కొడుకును ఎలా కాపాడుకున్నాడో చూడండి..

కొన్నిసార్లు కొన్ని ప్రమాదాలు ఊహించని విధంగా జరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంటుంది. అయితే మరికొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా వెంట్రుకవాసిలో తప్పిపోతుంటాయి. ఇలాంటి విచిత్ర ప్రమాద ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన కొడుకును ఎత్తుకుని బైకు వద్ద నిలబడి ఉండగా.. వెనుక నుంచి కారు దూసుకొచ్చింది. ఊహించని ఈ ప్రమాదం నుంచి అతను ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన కొడుకును తీసుకుని బైకులో బయటికి వెళ్లాలని అనుకుంటాడు. బైకును ఇంటి బయట రోడ్డు పక్క ఆపి, పిల్లాడిని బైకుపై కూర్చోబెట్టుకుని ఆడిస్తుంటాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. వెనుక నుంచి ఓ కారు అత్యంత వేగంగా దూసుకొస్తుంది. అతను వెనక్కు చూడగా.. అప్పటికే అత్యంత సమీపానికి వస్తుంది. దీంతో వెంటనే తన కొడుకును ఎత్తుకుని పక్కకు వెళ్లిపోతాడు. వేగంగా వచ్చిన కారు (car hit a bike) బైకుని ఢీకొని.. ఆగకుండా వెళ్లిపోతుంది.

Viral Video: కారు డ్రైవర్‌ను ఆసక్తిగా గమనించిన మహిళ.. దిగివెళ్తూ అతన్ని కౌగిలించుకుని మరీ.. ఆమె చెప్పిన విషయం తెలిస్తే..

కారు బలంగా ఢీకొనడంతో బైకు కూడా ఎగిరి దూరంగా పడిపోతుంది. అయితే సమయానికి అతను గమనించడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగదు. కారు డ్రైవర్ చేసిన పనికి అతడికి కోపం కట్టలు తెంచుకుంటుంది. పిల్లాడిని అక్కడే ఉన్న మహిళకు అందించి.. కోపంగా కారు వెళ్లిన వైపు వెళ్లిపోతాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో! చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: తలలో బుల్లెట్‌ ఉందని తెలీక పార్టీలో ఎంజాయ్ చేశాడు.. నాలుగు రోజుల తర్వాత డ్రైవింగ్ చేస్తుండగా..

Updated Date - Jan 26 , 2024 | 07:26 PM