Share News

Viral Video: జింక మాంసం కోసం హైనాల పోరాటం.. దాచిపెట్టడానికి చిరుతల ఆరాటం.. చివరకు..

ABN , Publish Date - Aug 07 , 2024 | 11:50 AM

పులులు, సింహాలను చూస్తే మిగతా జంతువులకు గుండె దడ మొదలవుతుంది. అవి తినగా మిగిలేసిన మాంసం కోసం అడవి కుక్కలు, హైనాలు తదితర జంతువలు పోటీ పడుతుంటాయి. అవి తింటుండగా మధ్యలో మాంసాన్ని లాక్కెళ్లే సాయసం ఏ జంతువూ చేయలేదు. అయితే..

Viral Video: జింక మాంసం కోసం హైనాల పోరాటం.. దాచిపెట్టడానికి చిరుతల ఆరాటం.. చివరకు..

పులులు, సింహాలను చూస్తే మిగతా జంతువులకు గుండె దడ మొదలవుతుంది. అవి తినగా మిగిలేసిన మాంసం కోసం అడవి కుక్కలు, హైనాలు తదితర జంతువలు పోటీ పడుతుంటాయి. అవి తింటుండగా మధ్యలో మాంసాన్ని లాక్కెళ్లే సాయసం ఏ జంతువూ చేయలేదు. అయితే కొన్నిసార్లు ఇందుకు విరుద్ధంగా జరుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. జింక మాంసం కోసం హైనాలు పోరాటం చేశాయి. మాంసం వాటికి దొరక్కుండా దాచిపెట్టేందుకు పులులు నానాతంటాలు పడ్డాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో (South Africa) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని పులులు (Tigers) జింకను వేటాడి తింటుండగా.. కొన్ని హైనాలు గమనిస్తాయి. అప్పటికే ఆకలితో ఉన్న హైనాలు (Hyenas) జింక మాంసాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. దీంతో వాటికి దక్కకుండా పులులు జింక మాంసాన్ని చెట్టు పైకి తీసుకెళ్తాయి. అయినా ఎలాగైనా జింక మాంసాన్ని (Deer meat) సొంతం చేసుకునేందుకు హైనాలన్నీ చెట్టు చుట్టూ పొంచి ఉంటాయి.

Viral Video: కిడ్నాప్ చేసిన కారు నుంచి ఎలా తప్పించుకోవాలో.. సింపుల్ ట్రిక్‌తో చెప్పేశాడుగా..


చెట్టుపై ఉన్న కొన్ని పులులు జింక మాంసానికి కాపలాగా ఉంటే.. చెట్టు కింద ఓ పులి.. హైనాలు దగ్గరికి రాకుండా కాపలా కాస్తుంటుంది. ఈ క్రమంలో చెట్టుపై ఉన్న జింక మాంసం కిందపడిపోతుంది. దీంతో ఎక్కడ హైనాలు ఎత్తుకెళ్లిపోతాయో... అనే భయంతో పులి కంగారుగా కిందకు దిగి, మాంసాన్ని నోట కరుచుకుని పరుగు పరుగున చెట్టుపైకి తీసుకెళ్తుంది. ఇలా మాంసం కిందపడిన ప్రతీసారీ పులులు భయంతో, కంగారుతో దాన్ని మళ్లీ చెట్టుపైకి చేరుస్తుంటాయి. ఫైనల్‌గా మాంసం కిందపడకుండా కొమ్మపై భద్రంగా ఉంచుతాయి. దీంతో హైనాలకు కోపం కట్టలు తెంచుకుంటుంది.

Viral Video: రైల్లో టీసీ ప్రశ్నకు యువకుడి వింత సమాధానం.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..


ఆగ్రహంగా ఉన్న హైనాలు చివరకు చెట్టు కిందకు వచ్చిన పులిని వెంబడిస్తాయి. హైనా వెంటపడడంతో ‘‘బతుకు జీవుడా’’.. అని అనుకుంటూ పులి అక్కడి నుంచి తోకముడిచి పారిపోతుంది. ఈ తమాషా సంఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘పులులకు చుక్కలు చూపించిన హైనాలు’’.. అంటూ కొందరు, ‘‘హైనాల పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 73 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: స్కూటీ మిడిల్ స్టాండ్ వేయాలంటే ఇబ్బందిగా ఉందా.. ఇతడి సింపుల్ ట్రిక్ చూడండి..

Updated Date - Aug 07 , 2024 | 11:50 AM