Share News

Viral Video: ఖరీదైన ఇంటి గోడలో షాకింగ్ సీన్.. పగుళ్ల నుంచి శబ్ధం రావడంతో ఏంటా అని చూస్తే.. చివరకు ఇళ్లంతా..

ABN , Publish Date - Aug 06 , 2024 | 01:19 PM

ఇళ్లల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. గోడ నుంచి వింత శబ్ధాలు రావడం, ఏంటా అని చూస్తే తేనెటీగలు బయటికి వస్తాయి. ఇంకొన్నిసార్లు ఇంటి సీలింగ్ నుంచి పాములు, కొండచిలువలు చొచ్చుకొస్తుంటాయి. ఇలాంటి..

Viral Video: ఖరీదైన ఇంటి గోడలో షాకింగ్ సీన్.. పగుళ్ల నుంచి శబ్ధం రావడంతో ఏంటా అని చూస్తే.. చివరకు ఇళ్లంతా..

ఇళ్లల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. గోడ నుంచి వింత శబ్ధాలు రావడం, ఏంటా అని చూస్తే తేనెటీగలు బయటికి వస్తాయి. ఇంకొన్నిసార్లు ఇంటి సీలింగ్ నుంచి పాములు, కొండచిలువలు చొచ్చుకొస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఖరీదైన ఇంటి గోడల పగుళ్ల నుంచి వింత శబ్ధాలు వచ్చాయి. ఏంటా అని చివరకు పరిశీలించే లోపే ఇళ్లు మొత్తం ఎలా మారిపోయిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడాలోని పాపులర్ ఫ్యూజన్ హోమ్స్ సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఖరీదైన ఇంట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటి గోడలకు ఏర్పడ్డ పగుళ్ల నుంచి ఏవో శబ్ధాలు వినిపించాయి. దీంతో ఇంట్లోని వారు.. అనుమానంతో అక్కడికి వెళ్లి పరిశీలించే లోపే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Viral Video: రైలు దిగడం కూడా సాహసమే.. ఇతడి పరిస్థితి చూస్తే.. షాకవ్వాల్సిందే..


గోడ అవతలి నుంచి నీళ్లన్నీ పగుళ్ల నుంచి ఇంట్లోకి వచ్చాయి. చూస్తుండగానే నీళ్ల ధార కాస్తా ప్రవాహంలా మారింది. కొద్దిసేపటికే ఇల్లు మొత్తం నీటితో నిండిపోయింది. అలాగే వంట గదిలోని గోడ పగుళ్ల నుంచి (water leakage from the wall cracks) కూడా ఇదే విధంగా నీళ్లన్నీ బయటికి వచ్చాయి. అయితే రెండు చోట్లా స్విచ్ బోర్డులు ఉండడతో.. ఎక్కడ షాక్ కొడుతుందో అని ఇంట్లోని వారంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.

Viral Video: తల్లీబిడ్డను రైలు ఎక్కించాలని చూడగా ఊహించని షాక్.. చివరకు యువకుడు చేసిన పనేంటో మీరే చూడండి..


ఈ ఇళ్లకు సమీపంలోని పైప్‌లైన్ పగిలిపోవడంతో నీళ్లన్నీ ఇలా ఇళ్లల్లోకి వచ్చినట్లు తెలిసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేంటీ మరీ వచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇంట్లోని వాల్.. వాటర్‌ఫాల్‌లా మారిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 77 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వంటింట్లో భర్తకు షాక్ ఇచ్చిన భార్య.. ఇలాంటి టాలెంట్ ఈమెకు మాత్రమే సాధ్యమేమో..

Updated Date - Aug 06 , 2024 | 01:42 PM