Share News

Viral video: నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటుంది మరి.. ఈ యువకుడికి ఏమైందో చూడండి..

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:25 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో లైక్‌లు, వ్యూస్‌ కోసం చాలా మంది ప్రమాదమని తెలిసినా.. ప్రాణాలకు తెగించి వివిధ రకాల విన్యాసాలు చేయడం చూస్తున్నాం. కొందరు ..

Viral video: నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటుంది మరి.. ఈ యువకుడికి ఏమైందో చూడండి..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో లైక్‌లు, వ్యూస్‌ కోసం చాలా మంది ప్రమాదమని తెలిసినా.. ప్రాణాలకు తెగించి వివిధ రకాల విన్యాసాలు చేయడం చూస్తున్నాం. కొందరు అందరి ముందు హీరోలా బిల్డప్ ఇస్తూ ఏవోవే విన్యాసా చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఊహిచంని ప్రమాదాల బారిన పడడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నిప్పుతో చెలగాటం ఆడుతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది యువతీయువకులు చూస్తుండగా.. ఓ యువకుడు నిప్పుతో విన్యాసం (man performed stunts with fire) చేసేందుకు సిద్ధమవుతాడు. నోటిలో డీజిల్ పోసుకుని, రెండు చేతుల్లో మండుతున్న నిప్పుతో వస్తాడు. అందరి ముందు చేతుల్లోని నిప్పును అటూ ఇటూ తిప్పుతూ షో చేస్తాడు. తర్వాత చేతుల్లోని నిప్పును మొఖంపై పెట్టుకుని నోటిలోని డీజిల్‌ను గట్టిగా బయటికి ఉమ్మేస్తాడు.

Viral video: కారు ఢీకొనడంతో ఎగిరి దూరంగా పడ్డ యువతి.. చివరకు ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..


అయితే ఈ క్రమంలో మంటలు (fire spread on the face) అతడి మూతికి తాకుతాయి. ఎంత ప్రయత్నించినా మంటలు ఆరిపోవు సరికదా.. ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ క్రమంలో మంటలు ఆర్పేందుకు అతను శతవిధాలా ప్రయత్నిస్తాడు. అయినా మంట ఇంకా ఎక్కువ అవుతుందే గానీ ఆరిపోదు. దీంతో పక్కన ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అక్కడికి వచ్చి అతడిని పట్టుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral video: రైలు పట్టాలపై షాకింగ్ సీన్.. పట్టాల మధ్యలో ఇరుక్కుపోయిన రిక్షా.. క్షణాల వ్యవధిలో..


ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ! పాపం ఇలా జరిగిందేంటీ’’.. అంటూ కొందరు, ‘‘అంత ప్రమాదం జరిగినా.. అతను చేతిలోని నిప్పును కింద పడేయలేదు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి ప్రయోగాలు ఎవరూ చేయొద్దు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 28 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: ఈ యువతి తెలివి మామూలుగా లేదుగా.. హోటల్లో ప్రియుడికి లిప్‌స్టిక్‌తో ఎలా షాక్ ఇచ్చిందో చూడండి..

Updated Date - Jun 14 , 2024 | 03:25 PM