Women: యువతి పిలవడంతో స్నేహితులతో కలిసి వెళ్లిన యువకుడు.. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత..
ABN , Publish Date - Jun 13 , 2024 | 07:36 PM
ప్రేమ పేరుతో కొందరు, డబ్బుల కోసం మరికొందరు మహిళలను వివిధ రకాలుగా మోసం చేయడం చూస్తూనే ఉంటాం. అలాగే చాలా మంది యువతులు కూడా ఇటీవల వివిధ రకాల నేరాలకు పాల్పడడం కూడా చూస్తున్నాం. కొందరైతే...
ప్రేమ పేరుతో కొందరు, డబ్బుల కోసం మరికొందరు మహిళలను వివిధ రకాలుగా మోసం చేయడం చూస్తూనే ఉంటాం. అలాగే చాలా మంది యువతులు కూడా ఇటీవల వివిధ రకాల నేరాలకు పాల్పడడం కూడా చూస్తున్నాం. కొందరైతే ఆన్‌లైన్ వేదికగా మోసాలకు పాల్పడుతుంటే.. మరికొందరు ఫోన్లలో మాయమాటలు చెబుతూ చివరకు తెలివిగా బురిడీ కొట్టిస్తుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువతి పిలవడంతో ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైలర్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడా పరిధి మోరాదాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన హుస్సేన్ (పేరు మార్చాం)కు ఇటీవల ఓ యువతి (young woman) నుంచి ఫోన్ వచ్చింది. మాటామాటా కలిపి అతడితో చనువుగా మాట్లాడింది. దీంతో అతను కూడా ఆమె మాటలు నమ్మి ఇష్టపడ్డాడు. ఇలా రోజూ ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. ఇదిలావుండగా, ఇటీవల ఓ రోజు డైరెక్ట్‌గా కలుద్దామంటూ అతడిని పిలిచింది. దీంతో హుస్సేన్.. తన స్నేహితులతో కలిసి ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు.
Viral video: అర్ధరాత్రి వాచ్‌మెన్‌కు షాకిచ్చిన ఆకతాయిలు.. ఫొటో తీస్తుండగా.. చివరకు..
అయితే తీరా అక్కడికి వెళ్లాక ఆమె నిజ స్వరూపం బయటపెట్టింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న రిఫా మనుషులు వారి వద్దకు చేరుకున్నారు. తనపై హుస్సేన్, అతడి స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారంటూ రిఫా వారితో చెప్పింది. దీంతో చివరకు అంతా కలిసి కేసులు పెడతామంటూ హుస్సేన్, అతడి స్నేహితులను బెదిరించారు. దీంతో చివరకు హుస్సేన్ వారికి అక్కడికక్కడే రూ.50వేలు సమర్పించుకున్నాడు. దీనిపై హుస్సేన్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Viral video: ఓరి దీని వేషాలో..! మాంసం కోసం ఎలుగుబంటి ఎదుట ఈ తోడేలు విన్యాసాలు చూస్తే..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చివరకు బుధవారం రిఫాతో పాటూ ముఠా సభ్యులను ప్యారీ చౌక్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యులు హనీ ట్రాప్ (Honey trap) తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. అమాయకులకు ఫోన్లు చేసి ప్రేమ పేరుతో నమ్మించడం, చివరకు అత్యాచారం పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral video: ఇదెలా సాధ్యం.. రాళ్లు పగులగొట్టగా మధ్యలో ఇతడికి దొరికిన వస్తువులేంటో చూడండి..