Share News

Viral Video: ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా.. కారు లాంటి ట్రాక్టర్‌ను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ABN , Publish Date - Dec 14 , 2024 | 01:00 PM

వాహనాలను చిత్రవిచిత్రంగా మార్చడాన్ని తరచూ చూస్తుంటాం. కొందరు పాత వాహనాలను సరికొత్తగా మార్చితే.. మరికొందరు ఒక వాహనం విడి భాగాలను మరో వాహనానికి అమర్చుతుంటారు. అలాగే ఇంకొందరు తమ వాహనాన్ని ముందు ఒక తరహాలో, వెనుక ఇంకో తరహాలో డిజైన్ చేసుకోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి..

Viral Video: ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా.. కారు లాంటి ట్రాక్టర్‌ను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

వాహనాలను చిత్రవిచిత్రంగా మార్చడాన్ని తరచూ చూస్తుంటాం. కొందరు పాత వాహనాలను సరికొత్తగా మార్చితే.. మరికొందరు ఒక వాహనం విడి భాగాలను మరో వాహనానికి అమర్చుతుంటారు. అలాగే ఇంకొందరు తమ వాహనాన్ని ముందు ఒక తరహాలో, వెనుక ఇంకో తరహాలో డిజైన్ చేసుకోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషలో మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తయారు చేసిన వింత వాహనాన్ని చూసి అ అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఇది కారు లాంటి ట్రాక్టర్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తికి తన పాత ట్రాక్టర్‌ను (old tractor) చూడగానే వింత ఆలోచన వచ్చింది. తన ట్రాక్టర్‌ను సరికొత్తగా మార్చి అందరి దృష్టినీ ఆకర్షించాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. ట్రాక్టర్ ఇంజిన్ స్థానంలో కారు ఇంజిన్‌ను సెట్ చేస్తే ఎలా ఉంటుందీ అని ఆలోచించాడు.

Viral Video: కరెన్సీ నోట్లను ఎదురుగా పెట్టుకుని.. ఇతను చేస్తున్న నిర్వాకం చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఆలోచన వచ్చిందే తడవుగా.. వెంనటే ఓ పాత కారు సగానికి విరగొట్టి.. (Car engine for tractor trolley) ముందు భాగాన్ని ట్రాక్టర్ టాలీకి తగిలించాడు. అంతా సిద్ధం చేశాక కారును స్టార్ట్ చేసి.. ఎంచక్కా రోడ్డుపై దూసుకెళ్లాడు. ముందు వైపు కారులా, వెనుక వైపు ట్రాక్టర్‌లో కనిపిస్తున్న ఈ వింత వాహనాన్ని అంతా ఆసక్తిగా గమనిస్తుంటారు. దీంతో ఈ వాహనం అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

Viral Video: వామ్మో.. ఇది నిజమేనా.. సింహాన్ని లాక్కెళ్తున్న డేగ.. షాకవుతున్న నెటిజన్లు..


ఈ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘మహీంద్రా ట్రాక్టర్ రూపురేఖలే మార్చేశాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 47 వేలకు పైగా లైక్‌‌లు, 4.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బాత్రూంలో షాకింగ్ సీన్.. గోడ బద్దలు కొట్టి చూడగా.. కళ్లు జిగేల్‌మనే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 14 , 2024 | 01:00 PM