Share News

Viral Video: ఓరి దీని వేషాలో.. షాపులోకి దూరిన గేదె.. పట్టుకోవాలని చూడగా.. ఎలా నటించిందో చూడండి..

ABN , Publish Date - Dec 14 , 2024 | 09:41 AM

కొన్ని జంతువులు కొన్నిసార్లు మనుషులను అనుకరిస్తుంటాయి. మరికొన్ని జంతువులు చేసే పనులు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. కుక్కలు, కోతులు, ఏనుగులు తదితర జంతువులు విచిత్రంగా ప్రవర్తించడం చూశాం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా..

Viral Video: ఓరి దీని వేషాలో.. షాపులోకి దూరిన గేదె.. పట్టుకోవాలని చూడగా.. ఎలా నటించిందో చూడండి..

కొన్ని జంతువులు కొన్నిసార్లు మనుషులను అనుకరిస్తుంటాయి. మరికొన్ని జంతువులు చేసే పనులు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. కుక్కలు, కోతులు, ఏనుగులు తదితర జంతువులు విచిత్రంగా ప్రవర్తించడం చూశాం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఓ గేదెకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు కట్టెల దుకాణంలోకి దూరిన గేదెను పట్టుకోవాలని చూశాడు. ఈ క్రమంలో గేదె చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ గేదె వేషాలు మామూలుగా లేవుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎలా వెళ్లిందో ఏమో తెలీదు గానీ.. ఓ గేదె చివరకు కట్టెల దుకాణంలోకి దూరింది. దీన్ని గమనించిన స్థానికులు దాన్ని పట్టుకునేందుకు దుకాణం షెట్టర్ మూసేశారు. దీంతో గేదె లోపలే ఉండిపోయింది. ఈ క్రమంలో ఓ యువకుడు చేతిలో తాడుతో అక్కడికి వచ్చాడు. ఎలాగైనా గేదెను తాడుతో బంధించి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. షట్టర్ అవతలి నుంచి మెల్లిగా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించాడు.

Viral Video: ఆత్మహత్యకు సిద్ధమైన యువతి.. బ్రిడ్జి పైనుంచి దూకుతుండగా.. వెనుక నుంచి ఉన్నట్టుండి..


ఆ వ్యక్తి లోపలికి రావడాన్ని గమనించిన గేదె కాసేపు అతన్నే చూస్తూ అక్కడే నిలబడింది. దీంతో ఆ వ్యక్తి లోపలికి వచ్చేందుకు తటపటాయించాడు. ఈ క్రమంలో గేదె.. ‘‘లోపలికి రారా.. నీ సంగతి చెబుతా’’.. అని అనుకున్నట్లుగా కాస్త పక్కకు వెళ్లి నిలబడుతుంది. దీంతో ఆ యువకుడు బయటికి నుంచి లోపలికి అయితే వస్తాడు. లోపలికి వచ్చాక భయం భయంగా నిలబడి గేదెను పట్టుకోవాలని చూస్తాడు. ఇంతలో ఆ గేదె (buffalo attacked young man) ఒక్కసారిగా అతడి పైకి దాడికి దిగుతుంది.
Viral Video: చెప్పులు ఆర్డర్ చేసిన యువతికి షాక్.. వస్తువు వచ్చింది కానీ.. తీక్షణంగా పరిశీలించగా..


గేదె దాడితో షాకైన ఆ వ్యక్తి .. ఎలాగోలా తప్పించుకుని.. ‘‘బతుకు జీవుడా’’.. అని అనుకుంటూ షట్టర్ పైకి తీసుకుని బయటికి పారిపోతాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ గేదె ప్లాన్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘మొత్తానికి చుక్కలు చూపించిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 33 వేలకు పైగా లైక్‌లు, 1.8 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తెలిసి తప్పు చేయడమంటే ఇదే.. రైలుకు వేలాడుతున్న యువతి.. చూస్తుండగానే..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 14 , 2024 | 09:41 AM