Viral Video: ఈ గొరిల్లా గొప్ప మనసు చూస్తే అవాక్కవ్వాల్సిందే.. ఫోన్ పడిపోయిందని తెలుసుకుని..
ABN , Publish Date - Jul 24 , 2024 | 09:24 PM
మనుషులను అనుకరించడంలో కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు ముందుంటాయి. ఇక గొరిల్లాలైతే అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. మనుషుల్లాగా అనుకరించడమే కాకుండా కొన్నిసార్లు మనుషుల్లాగే ఆలోచిస్తుంటాయి. ఇలాంటి..
మనుషులను అనుకరించడంలో కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు ముందుంటాయి. ఇక గొరిల్లాలైతే అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. మనుషుల్లాగా అనుకరించడమే కాకుండా కొన్నిసార్లు మనుషుల్లాగే ఆలోచిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి గొరిల్లా ఎన్‌క్లోజర్‌లో ఫోన్ పడేసుకున్నాడు. ఫోన్ పడిపోవడం చేసిన గొరిల్లా ఏం చేసిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది సందర్శకులు జంతు సందర్శనలలో పర్యటిస్తుంటారు. ఈ సందర్భంగా వారు గొరిల్లా ఎన్‌క్లోజర్‌పై (Gorilla enclosure) నిలబడి తిలకిస్తుంటారు. కింద గొరిల్లాను చూస్తూ ఎంజాయ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి ఫోన్ (phone) అందులో పడిపోతుంది. దీంతో ఒక్కసారిగా అతను షాక్ అయ్యాడు. దాన్ని తీసుకోవాలంటే ఎన్‌క్లోజర్‌లోకి దిగాల్సిన పరిస్థితి. అయితే అలాంటి వీలు లేకపోవడంతో అంతా చూస్తూ ఉండిపోతారు.
Viral Video: ఇది లిఫ్ట్ గదా.. లేక శవపేటికా.. అవాక్కవుతున్న నెటిజన్లు..
అయితే ఫోన్ కిందపడిపోవడాన్ని గమనించిన గొరిల్లా.. చకచకా అక్కడికి వచ్చి చేతిలోకి తీసుకుంటుంది. గొరిల్లాను గమనిస్తున్న వారంతా.. ఫోన్‌ను ఏం చేస్తుందబ్బా.. అని ఆసక్తిగా చూస్తుంటారు. ఫోన్‌ను చేతిలోకి తీసుకున్న గొరిల్లా పక్కకు వెళ్లిపోయేందుకు రెండు అడుగులు వేస్తుంది. దీంతో అంతా, గొరిల్లా ఫోన్ తీసుకుని వెళ్లిపోతుందేమో అని అనుకుంటారు. అంతకు ముందే పైనుంచి ఓ బుట్టకు తాడు కట్టి కిందకు వదులుతారు. అయితే రెండు అడుగులు ముందుకు వేసిన గొరిల్లా.. ఆ వెంటనే మనసు మార్చుకుని వెనక్కు వస్తుంది. ఫోన్‌ను బుట్టలో వేయడంతో అంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకుంటారు.
Viral Video: అయ్యో పాపం.. పాము నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ఈ తల్లి పక్షి తపన చూస్తే..
ఫోన్‌ను బుట్టలో వేసిన గొరిల్లా.. ‘‘మీ ఫోన్ మీరు తీసుకుని వెళ్లిపోండి.. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు చేయకండి’’.. అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆ బుట్టను చేత్తో పైకి ఎత్తి మరీ సహకరిస్తుంది. గొరిల్లా మంచి మనుసు చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ గొరిల్లా నిజంగా చాలా గ్రేట్’’.. అంటూ కొందరు, ‘‘దీన్ని చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 64 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: పెళ్లి వేదికపై వరుడి పక్కనే వధువు ఏడుపు.. ఓదార్చిన స్నేహితులు.. కారణమేంటని విచారించగా..