Share News

Viral Video: వేదికపైకి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డ వధువు.. అసలు విషయం గ్రహించిన వరుడు.. చివరకు ఏం చేశాడంటే..

ABN , Publish Date - Sep 12 , 2024 | 07:00 PM

ప్రస్తుతం జరిగే వివాహాలన్నీ వింతలు, వినోదానికి వేదిక అవుతున్నాయి. అలాగే ఆ మరుక్షణమే ఆ ఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట సందడి చేస్తుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్యర్యం కలిగితే.. మరికొన్ని వీడియోలను చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి..

Viral Video: వేదికపైకి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డ వధువు.. అసలు విషయం గ్రహించిన వరుడు.. చివరకు ఏం చేశాడంటే..

ప్రస్తుతం జరిగే వివాహాలన్నీ వింతలు, వినోదానికి వేదిక అవుతున్నాయి. అలాగే ఆ మరుక్షణమే ఆ ఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట సందడి చేస్తుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్యర్యం కలిగితే.. మరికొన్ని వీడియోలను చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధువు వేదికపైకి వెళ్లేందుకు ఇబ్బంది పడింది. దీంతో చివరకు వరుడు చేసిన నిర్వాకం చూసి అంతా తెగ నవ్వుకున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరుల (bride and groom) మధ్య సరదా సంఘటన చోటు చేసుకుంది. వధూవరులు ఇద్దరూ వేదిక పైకి వెళ్తూ ఉంటారు. వరుడు వధువు చేయి పట్టుకుని వేదిక పైకి తీసుకెళ్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వధువు వేసుకున్న డ్రస్ కారణంగా వేదిక పైకి వెళ్లే సమయంలో మెట్లు ఎక్కేందుకు ఇబ్బంది పడుతుంది.

Viral Video: మహిళకు లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. కారులో ఛేజ్ చేసిన యువకులు.. చివరకు అసలు విషయం చెప్పడంతో..


వరుడు చేయి పట్టుకుని లాగినా ఆమె మాత్రం పైకి ఎక్కలేక అక్కడే నిలబడిపోతుంది. చివరకు వరుడు ఆమె సమస్యను తెలుసుకుని తానే కిందకు దిగి వధువును తన చేతులపైకి ఎత్తుకుని పైకి తీసుకెళ్తాడు. వరుడు ఇలా వధువును తన చేతులపై ఎత్తుకెళ్లడం చూసి అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకుంటారు. కొందరు చప్పట్లు కొట్టి వరుడిని అభినందిస్తారు. ఇలా వరుడు తన భార్యకు ఇబ్బంది కలిగించకుండా ఎత్తుకెళ్లడంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Viral Video: దున్నపోతును వేటాడిన సింహాలు.. తీరా తినే సమయంలో మొదలైన గొడవ.. చివరకు జరిగింది చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘భార్యాభర్తల బంధం అంటే ఇలాగే ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘ఈ రోజుల్లో పెళ్లిళ్లన్నీ.. సినిమాల తరహాలో జరుగుతున్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 50 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మొసలి దంతాలకు లెగ్ పీస్‌తో పరీక్ష.. నోటిలో పెట్టి బలంగా లాగడంతో చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెళ్లిలో ఫొటోలు తీస్తుండగా షాకింగ్ సీన్.. వధువు తలపై ముద్దు పెట్టమంటే.. వరుడి వింత నిర్వాకం.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 12 , 2024 | 07:03 PM