Share News

Viral: ఫోన్‌లో మాట్లాడుతూ పువ్వును పీకేసిన యువతి.. ఆ మరుక్షణమే..

ABN , Publish Date - May 09 , 2024 | 04:43 PM

సాధారణంగా కొందరు పూలను చూడగానే వాసన చూడడమో.. లేదా తలలో పెట్టుకోవడమో చేస్తుంటారు. ఎలాంటి పూలైనా మేలు చేయకపోయినా.. కీడు మాత్రం చేయవు. అయితే ..

Viral: ఫోన్‌లో మాట్లాడుతూ పువ్వును పీకేసిన యువతి.. ఆ మరుక్షణమే..

సాధారణంగా కొందరు పూలను చూడగానే వాసన చూడడమో.. లేదా తలలో పెట్టుకోవడమో చేస్తుంటారు. ఎలాంటి పూలైనా మేలు చేయకపోయినా.. కీడు మాత్రం చేయవు. అయితే అన్ని పూలూ ఇలాగే ఉంటాయనుకుంటే పొరపాటే. కొన్ని పూలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. కానీ వాటి వెనుక ప్రాణాలు తీసే విషం కూడా ఉంటుందని చాలా మంది గుర్తించలేరు. తాజాగా, కేరళలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ యువతి ఫోన్‌లో మాట్లాడుతూ అనుకోకుండా పువ్వును పీకేసి నోట్లో పెట్టుకుంది. ఆ మరుక్షణమే ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. కేరళ (Kerala) రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సూర్య సురేంద్రన్ (24) అనే యువతి నర్సుగా (nurse) పని చేస్తుండేది. అయితే ఆమె ఇటీవల ఉద్యోగరీత్యా యూకేకి వెళ్లాల్సి వచ్చింది. ఆదివారం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది. అయితే ఇదే ఆమెకు చివరి రోజు అని తెలుసుకోలేకపోయింది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ఆమె.. స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న అరలి పూవ్వును (Oleander) పీకి నోట్లో పెట్టుకుంది. దీంతో కాసేపటికే ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది.

Puzzle: మీ కంటి చూపు బాగుంటే.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..


women.jpg

పువ్వు నోట్లో పెట్టుకున్న కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. దీంతో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. గుండెపోటు (heart attack) కారణంగానే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో అరలిపువ్వు, ఆకు తినడం వల్లే ఇలా జరిగిందని తేలిందని అధికారులు తెలిపారు. ఫోన్‌లో మాట్లాడుతుండగా.. అనుకోకుండా పక్కనే ఉన్న అరలి చెట్టు ఆకు, పువ్వు తెంపుకుని నమిలిందని, అయితే ఆ వెంటనే పొరపాటును గ్రహించి ఉమ్మేసిందని తెలిపారు.

Viral video: బాలిక లిఫ్ట్‌లో ఉండగా.. సడన్‌గా లోపలికి వచ్చిన కుక్క పిల్ల.. అంతలోనే..


అయితే అప్పటికే ఆకు, పువ్వుకు సంబంధించిన రసం కడుపులోకి వెళ్లడంతో అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. ఆమె రక్తంలో విష పదార్థాలు కలిసినట్లు తేలిందని వివరించారు. మృతురాలి తండ్రి సురేంద్రన్ భవన నిర్మాణ కార్మికుడు కాగా, ఆమె తల్లి అనిత టీ స్టాల్ నడుపుతోంది. తమ కూతురు బీఎస్సీలో మంచి మార్కులు సాధించిందని, విదేశాలకు వెళ్లి ఉన్నత స్థానంలో ఉంటుందని అనుకుంటే.. మమ్మల్ని వదిలేసి ఇలా తిరిగిరాని లోకాలకు చేరుకుందంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Viral video: బల్బ్ హోల్‌ నుంచి వింత శబ్ధాలు.. లోపల ఏముందా అని చూడగా.. చివరకు షాకింగ్ సీన్..

Updated Date - May 09 , 2024 | 04:50 PM