Share News

Viral Video: మేనకోడలి పెళ్లిలో ఖుషీ ఖుషీగా డాన్స్ చేయబోతూ.. అంతలోనే..

ABN , Publish Date - Apr 25 , 2024 | 06:07 PM

వినోద సమయాల్లో కొన్నిసార్లు ఉన్నట్టుండి విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. ‘‘అయ్యో పాపం..!’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral Video: మేనకోడలి పెళ్లిలో ఖుషీ ఖుషీగా డాన్స్ చేయబోతూ.. అంతలోనే..

వినోద సమయాల్లో కొన్నిసార్లు ఉన్నట్టుండి విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. ‘‘అయ్యో పాపం..!’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన మేనకోడలి పెళ్లిలో తలపై కుండ పెట్టుకుని సంతోషంగా డాన్స్ చేశాడు. అయితే అంతలోనే ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్ (Rajasthan) జుంజును జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నవ్లగాడ్ ప్రాంతానికి చెందిన యువతి (Young woman marriage) వివాహం ఏప్రిల్ 20న ఘనంగా జరిగింది. వివాహం సందర్భంగా బంధువులు, సన్నిహితులు, స్నేహితులంతా విచ్చేశారు. వివాహ ఊరేగింపు సమయంలో అంతా డాన్సులు వేస్తూ సంబరంగా గడిపారు. ఈ క్రమంలో వధువు మేనమామ కూడా అందరితో పాటూ సంతోషంగా డాన్సులు చేశాడు. అలాగే వారి సాంప్రదాయం ప్రకారం తలపై కుండ పెట్టుకుని వినూత్నంగా స్టెప్పులు వేశాడు. అతడి డాన్స్ (Dance) చూసి చుట్టూ ఉన్న వారంతా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు.

Viral Video: ఎండ వేడి భరించలేక.. లారీ నడుపుతూనే ఈ డ్రైవర్ చేసిన నిర్వాకం చూస్తే..

అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా తలపై కుండ పెట్టుకుని సంతోషంగా డాన్స్ చేసిన వ్యక్తి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో చుట్టూ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పరుగు పరుగున అక్కడికి వచ్చి అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. గుండెపోటు కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు. అప్పటిదాకా ఎంతో సంతోషంగా డాన్స్ చేసిన వ్యక్తి.. ఒక్కసారిగా ఇలా మృత్యుఒడిలోకి జారుకోవడాన్ని స్థానికులు జీర్ణించుకుకోలేకపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం..! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇది చాలా బాధాకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఆటో డ్రైవర్‌పై మహిళకు అనుమానం.. వెనుక నుంచి చూడగా.. అతడు చేస్తున్న నిర్వాకం.. చివరకు..

Updated Date - Apr 25 , 2024 | 06:07 PM