Share News

Viral video: ఎంత వేడిగా ఉంటే మాత్రం బైకుపై ఇవేం ఏర్పాట్లురా బాబూ.. ఇలా ఎవరైనా చేస్తారా..

ABN , Publish Date - Jun 09 , 2024 | 08:53 PM

ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఓ లారీ డ్రైవర్ వాహనం నడుపుతూనే స్నానం చేయడం చూశాం, మరో వ్యక్తి తన ఇంటిపై ...

Viral video: ఎంత వేడిగా ఉంటే మాత్రం బైకుపై ఇవేం ఏర్పాట్లురా బాబూ.. ఇలా ఎవరైనా చేస్తారా..

ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఓ లారీ డ్రైవర్ వాహనం నడుపుతూనే స్నానం చేయడం చూశాం, మరో వ్యక్తి తన ఇంటిపై వాటర్ స్ప్రింకర్లు ఏర్పాటు చేయడం చూశాం, ఇంకో వ్యక్తి స్కూటర్‌పై నీళ్ల డ్రమ్ములో కూర్చుని వాహనం నడపడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి చేసిన వినూత్న ప్రయోగానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఓ వ్యక్తి బైకుపై చేసుకున్న ఏర్పాట్లు చూసి.. ‘‘ఎంత వేడిగా ఉంటే మాత్రం బైకుపై ఇవేం ఏర్పా్ట్లురా బాబూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు బైకుపై వినూత్న ఏర్పాట్లు చేసుకున్నాడు. బైకు ముందు వైపు నుంచి, వెనుక వైపునకు ఇనుప రాడ్ ఏర్పాటు చేశాడు. తర్వాత దాని మధ్యలో సీలింగ్ ఫ్యాన్ బిగించాడు. దానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా బైకు వెళ్తున్న సమయంలో ఫ్యాన్ తిరిగేలా ఏర్పాట్లు చేశాడు. ఈ విధంగా ఆ వ్యక్తి.. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు బైకుపై (ceiling fan Installation on the bike) ఇలా సీలింగ్ ఫ్యాన్ ఏర్పాటు చేసి, అంతా అవాక్కయ్యేలా చేస్తున్నాడు.

Viral video: మనిషిలా ప్రవర్తిస్తున్న మేక.. టీ గ్లాసు దగ్గర పెట్టగానే.. ఒక్కసారిగా..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బైకులో వెళ్తున్నప్పుడు ఎలాగూ గాలి వీస్తుంది కదా.. మళ్లీ ఫ్యాన్ ఎందుకు’’.. అంటూ కొందరు, ‘‘ఎంత వేడిగా ఉంటే మాత్రం.. బైకుపై ఎవరైనా ఫ్యాన్ పెట్టుకుంటారా’’... అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: కూర ఉడుకుతుండగా ఖాళీ అయిన సిలిండర్.. చిన్న ట్రిక్‌తో వంట ఎలా పూర్తిచేశాడంటే..

Updated Date - Jun 09 , 2024 | 08:56 PM