Share News

Viral Video: ఫోన్‌లో లీనమైన వ్యక్తి.. పక్కనే బుసలు కొడుతున్న కోబ్రా.. చివరకు ఏమైందో చూస్తే..

ABN , Publish Date - Oct 10 , 2024 | 07:09 PM

ఓ వ్యక్తి పొలాల్లో చెట్టు కింద కూర్చుని ఫోన్‌లో మాట్లాడుతుంటాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న ఓ పాము.. అతన్ని చూసి ఆగింది. సమీపానికి వెళ్లి..

Viral Video: ఫోన్‌లో లీనమైన వ్యక్తి.. పక్కనే బుసలు కొడుతున్న కోబ్రా.. చివరకు ఏమైందో చూస్తే..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో పిల్లల నుంచి పెద్దలు, వృద్ధుల వరకూ చేతిలో ఫోన్ లేకపోతే పూట గడవని పరిస్థితి. కొందరైతే ఫోన్‌లో మునిగిపోతే పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోరు. చివరకు ఉరుము వచ్చి మీద పడ్డా సరే.. ఫోన్ మాయలో నుంచి మాత్రం బయటికి రారు. ఫోన్ చూస్తూ ప్రమాదాలకు గురయ్యే వారిని తరచూ చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫోన్‌లో మునిగిపోయిన ఓ వ్యక్తి.. పక్కన పాము బుసలు కొడుతున్నా పట్టించుకోలేదు. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పొలాల్లో చెట్టు కింద కూర్చుని (man talking on phone) ఫోన్‌లో మాట్లాడుతుంటాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అటుగా వెళ్తున్న ఓ పాము.. అతన్ని చూసి ఆగింది. సమీపానికి వెళ్లి పైకి లేచి పడగ విప్పి బుసలు కొడుతోంది.

Viral Video: పెగ్గు వేయగానే బయటపడ్డ టాలెంట్.. ఏకంగా బ్రూస్‌లీనే మించిపోయాడుగా..


అయినా ఆ వ్యక్తి మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. మరోవైపు పాము (snake) అతడి వైపే చూస్తూ బుసలు కొడుతూనే ఉంది. ఆ వ్యక్తి మాత్రం నవ్వుకుంటూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటాడు. అయితే కొద్ది సేపటి తర్వాత ఫోన్ అవతలి చేతిలోకి తీసుకుని, ఇంకో చేతిని పాముకు సమీపంలో నేలపై పెడతాడు. దీంతో పాము ఒక్కసారిగా అతడి చేతిపై కాటేస్తుంది. పాము కాటు వేయగానే ఉలిక్కిపడిన ఆ వ్యక్తి ఫోన్ కింద పడేసి, అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత పాము అక్కడి నుంచి పొదల్లోకి వెళ్లిపోతుంది.

Viral Video: ఇలాంటి చిరుత వేట ఎప్పుడైనా చూశారా.. దఢ పుట్టిస్తున్న వీడియో..


అయితే ఈ ఘటన చూస్తుంటే.. ఇదంతా వ్యూస్ కోసం కావాలనే తీసినట్లుగా అనిపిస్తున్నా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడియో తీస్తున్న వ్యక్తి చరిత్రలో నిలిచిపోతాడు’’.. అంటూ కొందరు, ‘‘ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా లైక్‌లు, 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లిలో లోబడ్జెట్ డీజే.. వీళ్ల ఐడియా చూస్తే.. అదుర్స్ అనాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 10 , 2024 | 07:09 PM