Share News

Viral Video: వామ్మో..! ఎలుగుబంట్లలో ఈ టాలెంట్ కూడా ఉందా.. కారు వద్ద అది చేస్తున్న నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Oct 09 , 2024 | 06:06 PM

అడవి జంతువులు జానావాసాల్లోకి చొరబడే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటే.. ఇంకొన్నిసార్లు వింత వింతగా ప్రవర్తిస్తూ అందరనీ షాక్‌కు గురి చేస్తుంటాయి. ఇలాంటి..

Viral Video: వామ్మో..! ఎలుగుబంట్లలో ఈ టాలెంట్ కూడా ఉందా.. కారు వద్ద అది చేస్తున్న నిర్వాకం చూస్తే..

అడవి జంతువులు జానావాసాల్లోకి చొరబడే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటే.. ఇంకొన్నిసార్లు వింత వింతగా ప్రవర్తిస్తూ అందరనీ షాక్‌కు గురి చేస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంటి బయట పార్క్ చేసిన ఉన్న కారు వద్ద.. రాత్రి వేళ ఓ ఎలుగుబంటి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఎలుగుబంట్లలో ఈ టాలెంట్ కూడా ఉందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి బయట పార్క్ చేసి ఉన్న కారు వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు రాత్రి వేళ ఓ ఎలుగుబంటి తన పిల్లలతో కలిసి సరదాగా జనావాల్లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో పిల్లలకు ఆకలేసిందో ఏమో గానీ.. సమయానికి ఏమీ కనిపించకపోవడంతో అక్కడ మొత్తం వెతికింది. అయినా దానికి ఎక్కడా ఏమీ కనిపించలేదు.

Viral Video: సింహాన్ని చూసి పొదల్లో దాక్కున్న గేదె.. మధ్యలో దోమలు చేసిన నిర్వాకంతో.. చివరకు..


చివరకు ఇంటి బయట పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లింది. ‘‘కారులో తినడానికేమైనా ఉన్నాయా’’.. అనుకుంటూ చూడసాగింది. అయితే కారు అద్దాలు లాక్ చేసి ఉండడంతో ఎలాగైనా తీయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అద్దాన్ని పట్టుకుని గట్టిగా లాగింది. ఇలా పదే పదే అద్దాన్ని పట్టుకుని లాగేడంతో చివరకు ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో ఎలుగుబంటి ధబేల్‌మని కిందపడిపోయింది. అయితే కాసేపటి తర్వాత తేరుకుని పైకి లేచి, కారులోకి తొంగి చూసి తినుబండారాల కోసం వెతికింది.

Viral Video: ఇది మరీ టూమచ్ భయ్యా.. ఇతను చేస్తున్న డేంజరస్ స్టంట్ చూస్తే.. నోరెళ్లబెడతారు..


అయితే దానికి లోపల ఎలాంటి వస్తువులూ కనిపించకపోవడంతో అక్కడి నుంచి నిరాశంగా వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఎలుగుబంటిలో ఈ టాలెంట్ కూడా ఉందా’’.. అంటూ కొందరు, ‘‘అంత కష్టపడ్డా.. ఫలితం లేకుండా పోయిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లు, 25.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 09 , 2024 | 06:06 PM