Share News

Viral Video: బాహుబలి స్టైల్లో బైకును ఎత్తాలని చూశాడు.. చివరకు జరిగింది చూస్తే..

ABN , Publish Date - Sep 26 , 2024 | 09:40 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యాడో తెలీదు గానీ.. ఓ వ్యక్తి వినూత్న విన్యాసం చేసి నెట్టింట ఫేమస్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. చివరకు బాహుబలి అనిపించుకోవాలనే ఉద్దేశంతో బైకును ఎత్తాలని నిర్ణయించుకున్నాడు..

Viral Video: బాహుబలి స్టైల్లో  బైకును ఎత్తాలని చూశాడు.. చివరకు జరిగింది చూస్తే..

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా.. కొన్నిసార్లు కొందరు ఏదో చేయాలని చూడగా.. చివరకు అసలుకే ఎసరు వస్తుంటుంది. మరికొందరు ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో సాధ్యం కాని సాహసాలు చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బాహుబలిలా మారి బైకును ఎత్తాలని చూశాడు. అయితే చివరకు జరిగిన ఘటన చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యాడో తెలీదు గానీ.. ఓ వ్యక్తి వినూత్న విన్యాసం చేసి నెట్టింట ఫేమస్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. చివరకు బాహుబలి అనిపించుకోవాలనే ఉద్దేశంతో బైకును ఎత్తాలని నిర్ణయించుకున్నాడు. స్టాండ్ వేసిన బైకు (bike) వద్దకు వెళ్లిన అతను.. ముందుగా కెమెరాకు వీరుడిలా ఫోజులు ఇచ్చాడు. ఆ తర్వాత అసలు విన్యాసానికి (stunt) సిద్ధమయ్యాడు.

Viral Video: ఈమె తెలివి మామూలుగా లేదుగా.. ప్రెషర్ కుక్కర్‌పై ఆయిల్ పోసి.. ఆ సమస్యకు చెక్ పెట్టిందిగా..


బైకు పక్కన కూర్చుని రెండు చేతులో దాన్ని పట్టుకుని పైకి ఎత్తడానికి ప్రయత్నించాడు. అయితే పైకి ఎత్తడం కాదు కదా.. చివరకు దాని కింద పడి భూమికి అతుక్కుపోయాడు. బైకును పైకి ఎత్తలేక.. మరోవైపు దాని బరువును భరించలేక గట్టిగా కేకలు పెట్టాడు. దీంతో అక్కడే ఉన్న మహిళ పరుగెత్తుకుంటూ వచ్చి, అతి కష్టం మీద బైకును పైకి ఎత్తి అతన్ని కాపాడుతుంది. బైకు ఎత్తాలని ఫోజులు కొట్టిన అతను.. చివరకు కుయ్యో.. మొర్రో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Viral Video: వంటగదిలో పనిలో ఉన్న మహిళ.. సడన్‌గా కొండచిలువ ఎంట్రీ.. 2 గంటల తర్వాత లోపలికి వెళ్లి చూడగా..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సమయానికి ఆమె రాకుండా ఉండుంటే.. నిజంగా బలి అయ్యేవాడే’’.. అంటూ కొందరు, ‘‘అతను బైక్ ఎత్తడం లేదు.. దాని కింద పడుకున్నాడు.. అంతే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మద్యం మత్తులో కుక్కకు ముద్దు పెట్టాడు.. చివరికి ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 26 , 2024 | 09:40 PM