Share News

Viral Video: వంటగదిలో పనిలో ఉన్న మహిళ.. సడన్‌గా కొండచిలువ ఎంట్రీ.. 2 గంటల తర్వాత లోపలికి వెళ్లి చూడగా..

ABN , Publish Date - Sep 26 , 2024 | 07:10 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. 64 ఏళ్ల మహిళ... ఇటీవల ఓ రోజు ఇంట్లో ఉండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దాహం వేయడంతో నీళ్లు తెచ్చుకోవడానికి ఆమె వంటింట్లోకి వెళ్లింది. అయితే నీళ్లు తాగే సమయంలో ఉన్నట్లుండి..

Viral Video: వంటగదిలో పనిలో ఉన్న మహిళ.. సడన్‌గా కొండచిలువ ఎంట్రీ.. 2 గంటల తర్వాత లోపలికి వెళ్లి చూడగా..
ప్రతీకాత్మక చిత్రం

పాములు, కొండచిలువలు మనుషులపై దాడి చేయడం చూస్తుంటాం. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ వంట గదిలో ఉండగా.. సడన్‌గా కొండచిలువ ఎంట్రీ ఇచ్చింది. 2 గంటల తర్వాత లోపలికి వెళ్లి చూడగా..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో (Thailand) చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల ఆరోమ్ అరుణ్‌రోజ్ అనే మహిళ... ఇటీవల ఓ రోజు ఇంట్లో ఉండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దాహం వేయడంతో నీళ్లు తెచ్చుకోవడానికి ఆమె వంటింట్లోకి వెళ్లింది. అయితే నీళ్లు తాగే సమయంలో ఉన్నట్లుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral Video: ఎగరడానికి బద్ధకించిన పక్షులు.. విమానాన్ని ఎలా వాడుకున్నాయో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ఓ పెద్ద కొండ చిలువ వంటింట్లోకి దూరింది. మహిళను టార్గెట్ చేసిన కొండచిలువ.. (python attacked a woman) చివరకు ఆమెపై దాడికి దిగింది. కాళ్లపై కొరకడంతో పాటూ ఆమెను చుట్టేసి గట్టిగా పట్టుకుంది. పాము తలను పట్టుకుని పక్కకు లాగేయాలని ప్రయత్నించినా కూడా సాధ్యం కాలేదు. చివరకు కొండచిలువ ఆమెను మరింత గట్టిగా చుట్టేసుకుని కిందపడేసింది. ఇలా సుమారు రెండు గంటల పాటు ఆమె కొండచిలువతో పోరాడింది. ఈ క్రమంలో ఆమె అరుపులు విన్న చుట్టు పక్కల వారు పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. కొండచిలువ దాడి చేయడం చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Viral Video: పక్కనే కూర్చుని సెల్ఫీ తీసుకున్న మరదలు.. మధ్యలో వరుడి నిర్వాకాన్ని పసిగట్టిన వధువు.. చివరకు..


సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. థాయ్‌లాండ్‌లో కొండచిలువు ఇళ్ల పరిసరాల్లో కనిపించడం సర్వసాధారణమని స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ’’.. అంటూ కొందరు, ‘‘అధికారుల పనితీరును భేష్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మద్యం మత్తులో కుక్కకు ముద్దు పెట్టాడు.. చివరికి ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 26 , 2024 | 07:10 PM