Share News

Viral Video: రీల్స్ కోసం ఇలా ఎవరైనా చేస్తారా.. బావి పైన కూర్చుని ఈమె చేసిన పని చూడండి..

ABN , Publish Date - Sep 20 , 2024 | 09:49 PM

ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే క్రమంలో కొందరు ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కొందరు మహిళలు కూడా చిత్రవిచిత్ర పనులు చేస్తూ అందరి ఆగ్రహానికి గురవడం చూస్తున్నాం. తాజాగా, ఓ మహిళ నిర్వాకానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈమె చేసిన పని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు..

Viral Video: రీల్స్ కోసం ఇలా ఎవరైనా చేస్తారా.. బావి పైన కూర్చుని ఈమె చేసిన పని చూడండి..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువతీయువకులతో పాటూ పిల్లలు, వృద్ధులు మొదలుకొని పల్లెల్లో పనులు చేసుకునే మధ్య వయసు మహిళలు కూడా రీల్స్ చేయడం అలవాటుగా చేసుకుంటున్నారు. అయితే ఆ అలవాటు ఓ పరిధి మేరకు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదుగానీ.. ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఇబ్బందుల్లో పడడమే కాకుండా ఎదుటివారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం మన కళ్ల ముందు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ మహిళ రీల్స్ కోసం బావిపై కూర్చుని చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రీల్స్‌కు అడిక్ట్ అయిన ఓ మహిళ (woman) .. ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అందరిలా కాకుండా వినూత్నంగా రీల్స్ (Reels) చేయాలనే ఉద్దేశంతో చివరకు ఓ బావిని సెలెక్ట్ చేసుకుంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఆ తర్వాత ఆమె చేసిన పని అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది.

Viral Video: సైకిల్ తొక్కుతూనే ఇలా చేయడం ఎలా సాధ్యం.. ఇతను చేస్తున్న విన్యాసం చూస్తే.. షాకవ్వాల్సిందే..


గట్టు పైన కూర్చున్న ఆమె తన కాళ్లను బావిలోకి (well) వేలాడదీసింది. అంతటితో ఆగకుండా పిల్లాడి (child) చేతులు పట్టుకుని బావిలోకి వేలాడదీస్తూ పాటకు యాక్షన్ చేస్తోంది. అటూ, ఇటూ ప్రమాదకరంగా కదులుతూ పాట పాడుతోంది. మరోవైపు పిల్లాడు భయపడుతూ వణికిపోతున్నాడు. అయినా అదేమీ పట్టించుకోకుండా ఆమె కెమెరాకు ఫోజులు ఇస్తూ యాక్టింగ్ చేస్తూనే ఉంది.

Viral Video: వామ్మో.. ఏనుగుకు తిక్కరేగితే ఇలా ఉంటుందా.. ఆహారం తినిపించాలని చూడగానే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో పిల్లాడిని ఇబ్బంది పెడుతున్న ఈమె నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, ‘‘మీ పిచ్చి కోసం ఇలా పిల్లలను బలిచేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 58 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: విద్యార్థులు క్లాస్‌ రూమ్‌లో ఉండగా ఊహించని ఘటన.. గోడ పైకి చూడగా షాకింగ్ సీన్.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 20 , 2024 | 09:50 PM