Share News

Viral Video: వామ్మో..! షాకింగ్ వీడియో... సింహంపైనే స్వారీ చేశాడు.. ఆ వెంటనే..

ABN , Publish Date - Aug 03 , 2024 | 10:06 AM

పులులు, సింహాలను చూడాలని అనుకుంటారేమో గానీ.. వాటికి ఎదురుగా వెళ్లాలని మాత్రం ఎవరూ అనుకోరు. అయితే కొందరు మాత్రం వాటితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. అలాగే మరికొందరు..

Viral Video: వామ్మో..! షాకింగ్ వీడియో... సింహంపైనే స్వారీ చేశాడు.. ఆ వెంటనే..

పులులు, సింహాలను చూడాలని అనుకుంటారేమో గానీ.. వాటికి ఎదురుగా వెళ్లాలని మాత్రం ఎవరూ అనుకోరు. అయితే కొందరు మాత్రం వాటితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. అలాగే మరికొందరు వాటితో గేమ్స్ ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సింహంపై కూర్చుని స్వారీ చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన పాకిస్థాన్‌లో జరిగినట్లు సమాచారం. ఓ వ్యక్తి సింహాల బోనులోకి వెళ్లాడు. వెళ్లడమే కాదు వాటితో చిన్న పిల్లల తరహాలో ఆడుకున్నాడు. అంతటితో ఆగకుండా చివరకు సింహంపై (man rides lion) కూర్చుని కొద్ది సేపు స్వారీ కూడా చేశాడు. అయితే అంతలో సింహాల ట్రైనర్ కేకలు వేయడంతో వెంటనే కిందకు దిగాడు.

Viral Video: సీన్ రివర్స్ అంటే ఇదేనేమో.. ఇంట్లోకి దూరిన చిరుత పులి.. అక్కడే ఉన్న కుక్కలు గమనించడంతో..


ఆ తర్వాత అక్కడే ఉన్న మరో సింహాన్ని.. టీచర్ బెత్తంతో పిల్లల్ని భయపెట్టినట్లుగా.. ఇతను కూడా (man scared the lion) ఆ సింహాన్ని హడలెత్తిస్తాడు. ఆ వ్యక్తి కర్రతో కొట్టాలని ప్రయత్నించడంతో సింహం భయంతో పారిపోవాలని చూస్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదేనేమో.. ప్లాట్‌ఫామ్‌పై ఈమె చేసిన పని చూడండి..


ఈ ‘‘ఈ సింహాలను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’’.., ‘‘అది గుర్రం కాదు స్వారీ చేయడానికి.. తిక్క లేస్తే ముక్కలు ముక్కలు చేస్తుంది’’.., ‘‘సింహాల వద్ద అంతసేపు ఉన్నారంటే గ్రేట్’’.., ‘‘పాకిస్థాన్‌లో ఇలా చాలా మంది సింహాలను పెంచి విక్రయిస్తుంటారు’’.., ‘‘ఇలా చేస్తుంటే.. ఏదో రోజు దానికే బలవుతావ్’’.., ‘‘జంతువులను హింసించడం నేరం’’.., ‘‘క్రూర జంతువులతో ఇలాంటి ఆటలు ఆటడం ప్రమాదరం’’.. అంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 36 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మానిటర్ బల్లిని కసితీరా కొరికిన నల్ల పాము.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - Aug 03 , 2024 | 10:06 AM