Share News

Viral Video: బజార్లో దొరికే తేనె అసలైనదేనా.. ఇతడు వాడిన ట్రిక్ చూస్తే..

ABN , Publish Date - Aug 02 , 2024 | 10:37 AM

ప్రస్తుతం మార్కెట్లలో దొరికే వస్తువుల్లో ఏది అసలైనదో ఏది నకిలీనో తెలుసుకోవడం చాలా కష్టంటా మారింది. అచ్చం ఒరిజినల్‌కు తీసిపోని విధంగా నకిలీలను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో...

Viral Video: బజార్లో దొరికే తేనె అసలైనదేనా.. ఇతడు వాడిన ట్రిక్ చూస్తే..

ప్రస్తుతం మార్కెట్లలో దొరికే వస్తువుల్లో ఏది అసలైనదో ఏది నకిలీనో తెలుసుకోవడం చాలా కష్టంటా మారింది. అచ్చం ఒరిజినల్‌కు తీసిపోని విధంగా నకిలీలను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో పప్పు దినుసుల నుంచి దాదాపు చాలా ఆహార పదార్థాలను కల్తీ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి బజార్లో దొరికే తేనెను అసలైనదని ఎలా గుర్తించాలనే విషయంపై ఓ ట్రిక్ ప్రయోగించి చూపించాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తేనె ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసిందే. అయితే చెట్టు నుంచి తెచ్చిన తేనె అందరికీ అందుబాటులో ఉండడం కష్టతరమైనది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అనేక కంపెనీలు మార్కెట్లలో బాటిళ్ల రూపంలో తేనెను అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ క్రమంలో కొందరు తేనెను బకెట్లలో తీసుకొచ్చి బజార్లలో రోడ్ల పక్కన విక్రయిస్తుంటారు. తాము నేరుగా చెట్లపై నుంచి తెచ్చామని చెబుతుంటారు.

Viral Video: సీన్ రివర్స్ అంటే ఇదేనేమో.. ఇంట్లోకి దూరిన చిరుత పులి.. అక్కడే ఉన్న కుక్కలు గమనించడంతో..


అయితే ఇలాంటి తేనె అసలైనదా లేక నకిలీదా అనేది ఎలా తెలుసుకోవాలనే దానిపై ఓ వ్యక్తి ప్రయోగం (experiment) చేసి చూపించాడు. ఓ వ్యక్తి రోడ్డు పక్కన బకెట్లో తేనెను పరీక్షించి చూపించాడు. వేలితో తేనెను తీసుకున్న అతను.. దాన్ని పక్కన ఉన్న వ్యక్తి చొక్కాపై పూశాడు. తర్వాత దాన్ని తుడిచేయగా మొత్తం పోయింది. ఒరిజినల్ తేనె (Original Honey) అయితే తుడవగానే మొత్తం పోతుందని, అదే నకిలీదైతే చొక్కాకు అంటుకుపోతుందని సదరు యువకుడు వివరించాడు.

Viral Video: నిధి కోసం వెతుకుతుండగా... మోగిన మెటల్ డిటెక్టర్.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఒరిజినల్ తేనెను ఎలా గుర్తించాలో చాలా బాగా వివరించాడు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాగే చూపిస్తారు.. మేము ఇలాంటి చోటే తేనె తీసుకుంటే చివరకు అది డూప్లికేట్ అని తేలింది’’.. అంటూ మరికొందరు, ‘‘తమ్ముడు తనతో పాటూ తేనెటీగను కూడా తీసుకొచ్చాడు.. ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: యువతి పక్కనే నిలబడి.. ఆమెకు తెలీకుండానే.. ఈ వృద్ధుడు చేసిన నిర్వాకం చూడండి..

Updated Date - Aug 02 , 2024 | 10:37 AM