Share News

Viral Video: ఈమె అతి తెలివికి దండం పెట్టొచ్చు.. వాషింగ్ మెషిన్‌ను ఎలా వాడిందో చూస్తే..

ABN , Publish Date - Jul 30 , 2024 | 11:56 AM

ఇళ్లల్లో వస్తువులను చిత్రవిచిత్రంగా వాడే వారిని రోజూ చూస్తూనే ఉంటాం. కొందరు కూలర్‌ను ఫ్రిడ్జ్‌లా మార్చి పండ్లు, కూరగయలు పెడుతుంటారు. ఇంకొందరు ఫ్రిడ్జి నుంచి వచ్చే చల్లదనంతో ఇంటిని ఏసీలా మార్చుతుంటారు. మరొక ...

Viral Video: ఈమె అతి తెలివికి దండం పెట్టొచ్చు.. వాషింగ్ మెషిన్‌ను ఎలా వాడిందో చూస్తే..

ఇళ్లల్లో వస్తువులను చిత్రవిచిత్రంగా వాడే వారిని రోజూ చూస్తూనే ఉంటాం. కొందరు కూలర్‌ను ఫ్రిడ్జ్‌లా మార్చి పండ్లు, కూరగయలు పెడుతుంటారు. ఇంకొందరు ఫ్రిడ్జి నుంచి వచ్చే చల్లదనంతో ఇంటిని ఏసీలా మార్చుతుంటారు. మరొక మహిళేమో.. ఇటుకలతో ఏకంగా వాషింగ్‌మెషిన్ తరహాలో నిర్మాణం చేపడుతుంది. ఇలాంటి వీడియోలు రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ మహిళ వాషింగ్ మెషిన్‌ను వాడిన విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వాషింగ్ మెషిన్‌ను (Washing machine) వాడే విధానం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. సాధారణంగా ఎవరైనా వాషింగ్‌మెషిన్‌ను బట్టలు ఉతికేందుకు ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది.

Viral Video: బార్డర్‌లో సైనికులకే కాదు.. జింకలకూ పోటాపోటీ.. కంచెకు రెండు వైపులా వాటి నిర్వాకం చూస్తే..


వాషిన్‌మెషిన్‌ను ఓపెన్ చేసిన ఆమె.. ముందుగా అందులో నీరు పోసి, తర్వాత అందులో లిక్విడ్ పోస్తుంది. ఆ తర్వాత ఏకంగా ఇంట్లోని (Woman putting dishes in washing machine) వంట పాత్రలన్నీ అందులో పడేస్తుంది. ఫైనల్‌గా మిషిన్ ఆన్ చేయగా.. గిరాగిరా వేగంగా తిరిగి పాత్రలు క్లీన్ అవుతాయి. ఇలా దుస్తులను వేయాల్సిన మిషిన్‌లో పాత్రలు వేసి శుభ్రం చేసింది. ఈమె అతి తెలివి చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: ఇంట్లోకి దూరి కుక్కను ఎత్తుకెళ్లిన చిరుతపులి.. కాస్త దూరం వెళ్లగానే.. ఒక్క అరుపుతో.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘వాషింగ్‌మెషిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఈమె అతి తెలివికి హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: స్కూటీ నడపడమే కాదు.. ఎక్కడ బ్రేక్ వేయాలో కూడా తెలియాలి.. ఈ అమ్మాయిలు ఏం చేశారో చూడండి..

Updated Date - Jul 30 , 2024 | 11:56 AM