Share News

Viral Video: అరటిగెలే కదా అని చేతులు పెట్టేస్తున్నారా.. కాస్త ఆగి చూడగా.. దిమ్మతిరిగే సీన్..

ABN , Publish Date - Aug 28 , 2024 | 09:40 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అరటి తోటలో కూలీలు గెలలు తెంపుతుండగా వారికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ పెద్ద అరటి గెలను తెంచి పక్కకు తీస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. గెల మధ్యలో..

Viral Video: అరటిగెలే కదా అని చేతులు పెట్టేస్తున్నారా.. కాస్త ఆగి చూడగా.. దిమ్మతిరిగే సీన్..

వ్యవసాయ పనుల్లో రైతులకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయినా అన్నింటినీ ఓర్చుకుని కష్టపడుతుంటారు. పంట పండించి మార్కెట్‌కు తరలించే వరకూ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అలాగే ఎన్నో ప్రమాదాలనూ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అరటిగెలే కదా అని దగ్గరికి వెళ్లి పండు పీకేందుకు చూడగా.. చివరకు షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అరటి తోటలో కూలీలు గెలలు తెంపుతుండగా వారికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ పెద్ద అరటి గెలను తెంచి పక్కకు తీస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. గెల మధ్యలో ఏదో ఉన్నట్లు అనిపించి తీక్షణంగా చూడగా చివరకు గెలలోని అరటి పండ్ల మధ్యలో ఓ పాము దాక్కుని కనిపించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Viral Video: ఇందుకే హెల్మెట్ పెట్టుకోమని చెప్పేది.. పైనుంచి దూసుకొచ్చిన ప్రమాదం నుంచి ఇతనెలా తప్పించుకున్నాడంటే..


చివరకు ఆ అరటి గెలను పైన వేలాడదీసి, కర్రతో చప్పుడు చేయగా లోపల ఉన్న పాము (snake in the middle of banana gela) మెల్లగా బయటికి వచ్చింది. అయితే పామును తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాల్లో వదలాల్సింది పోయి.. చివరకు అంతా చూస్తుండగానే కర్రతో కొట్టి చంపేశారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral: కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన రోగి.. చివరకు స్కానింగ్ తీయగా పేగుల్లో షాకింగ్ సీన్..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది’’.., ‘‘పామును చంపకుండా దూరంగా వదిలేసి ఉంటే బాగుండేది’’.., ‘‘పొలం పనులు చేసే సమయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి’’.., ‘‘ఇది అత్యంత విషపూరితమైన పాము.. రైతులు జాగ్రత్తగా ఉండాలి’’.., ‘‘హాని చేయకుంటే ఏ పామూ దాడి చేయదు.. ఇలా చంపడం చాలా తప్పు’’.., ‘‘అరటిగెలలు తెంపే సమయంలో చేతులకు గ్లౌజులు వేసుకోవాలి’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పడగ విప్పిన పామును కూడా కూల్ చేసిన గేదె.. చివరికి ఏమైందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Aug 28 , 2024 | 09:48 PM