Share News

Viral Video: ఇదీ.. ఖడ్గమృగాల పవర్ అంటే.. ఎదురుగా రావడం చూసి ఈ సింహాలు ఏం చేశాయో చూడండి..

ABN , Publish Date - Aug 28 , 2024 | 04:07 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ అడవిలో రెండు సింహాలు రోడ్డుపై పడుకుని వేట కోసం కాపుకాచి ఉంటాయి. ఏదైనా జంతువు అటుగా వస్తే వేటాడేద్దామని చూస్తుంటాయి. అయితే..

Viral Video: ఇదీ.. ఖడ్గమృగాల పవర్ అంటే.. ఎదురుగా రావడం చూసి ఈ సింహాలు ఏం చేశాయో చూడండి..

అడవిలో జంతువుల మధ్య అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. సాధారణంగా అన్ని జంతువులూ సింహాలకు భయపడుతుంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. మిగతా జంతువులను చూసి సింహాలు జడుసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ప్రధానంగా ఏనుగులు చూస్తే సింహాలకు వణుకుపుడుతుంది అని అంతా అనుకుంటాం. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఖడ్గమృగాలను చూసి కూడా ఏనుగులు భయపడ్డాయి. ఎదురుగా వస్తుండడం చూసి ఏం చేశాయో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అడవిలో రెండు సింహాలు (lions) రోడ్డుపై పడుకుని వేట కోసం కాపుకాచి ఉంటాయి. ఏదైనా జంతువు అటుగా వస్తే వేటాడేద్దామని చూస్తుంటాయి. అయితే ఎంత సేపు చూసినా అక్కడికి ఎలాంటి జంతువూ రాదు. అయితే కాసేపటి తర్వాత ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.

Viral Video: బైకు నడుపుతున్న యువతి.. సడన్‌గా టైరులో ఇరుక్కున్న చున్నీ.. చివరకు..


రెండు పెద్ద ఖడ్గమృగాలు అటువైపు మెల్లిగా నడుచుకుంటూ వస్తుంటాయి. తీరా దగ్గరికి రాగానే సింహాలు వాటిని చూసి అలెర్ట్ అవుతాయి. ‘‘వామ్మో.. ఖడ్గమృగాలు (Rhinoceros) వస్తున్నాయి.. ఇక్కడి నుంచి వెళ్లిపోవడం బెటర్’’.. అని అనుకుంటూ పైకి లేచి రోడ్డు పక్కగా వెళ్లి నిలబతాయి. అయితే ఖడ్గమృగాలు మరింత దగ్గరగా రావడం చూసి మరింత లోపలికి వెళ్లి చెట్టు చాటున నిలబడతాయి. ఖడ్గమృగాలు అక్కడి నుంచి వెళ్లే వరకూ చెట్టు చాటుగా నిలబడి, తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడం వీడియోలో చూడొచ్చు.

Viral Video: ఈ వధూవరుల క్రియేటివిటీ మామూలుగా లేదుగా.. భార్యను తన ఇంటికి ఎలా తీసుకెళ్తున్నాడో చూస్తే..


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహాలకు చుక్కలు చూపించిన ఖడ్గమృగాలు’’.. అంటూ కొందరు, ‘‘సింహాలు చాలా తెలివైనవి.. ఎక్కడ తగ్గాలో, ఎలా వేటాడాలో వాటికి బాగా తెలుసు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఏనుగుతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలీక అనవసరంగా కెలికింది.. చివరకు ఖడ్గమృగం పరిస్థితి ఇదీ..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 28 , 2024 | 04:07 PM