Share News

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

ABN , Publish Date - Sep 25 , 2024 | 06:01 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏదోటి చేసి ఎలాగైనా నెటిజన్లను ఆకట్టుకోవాలని ఓ మహిళ ఫిక్స్ అయినట్లుంది. ఏం చేద్దామా.. ఏం చేద్దామా.. అని ఆలోచిస్తున్న ఆమెకు.. చివరకు ఓ బంపర్ ఐడియా వచ్చింది. చపాతీలను..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

సినిమాల్లో చూసే సీరియస్, కామెడీ సీన్లన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోల రూపంలో దర్శనమిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు చిత్ర విచిత్ర ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొందరు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంటారు. ఇటీవల పల్లెటూర్లలోని మహిళలు కూడా పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ చపాతీలు చేసే విధానం చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ‘‘భర్తను ఇలాక్కూడా వాడుకోవచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏదోటి చేసి ఎలాగైనా నెటిజన్లను ఆకట్టుకోవాలని ఓ మహిళ (woman) ఫిక్స్ అయినట్లుంది. ఏం చేద్దామా.. ఏం చేద్దామా.. అని ఆలోచిస్తున్న ఆమెకు.. చివరకు ఓ బంపర్ ఐడియా వచ్చింది. చపాతీలను చేయడంలో వినూత్నంగా ఆలోచించే వారిని చూస్తున్నాం. అయితే ఈమె మాత్రం చపాతీలను (chapatis) అందరిలా కాకుండా విచిత్రంగా చేయాలని నిర్ణయించుకుంది.

Viral Video: ఒకే ఒక్క పాప్‌కార్న్ గింజతో మిలియన్ల వ్యూస్.. ఇంతకీ ఈమె చేసిన ప్రయోగం ఏంటో చూడండి..


ఇందుకోసం తన భర్తను వినియోగించుకుంది. పొయ్యి వద్ద కూర్చున్న భర్త చపాతీ పిండిని ఉండలుగా చేసి తన భార్యకు ఇవ్వగా.. ఆమె ఆ పిండి ఉండను చివరకు భర్త గుండుపై రుద్ది, మళ్లీ అతడికే ఇచ్చింది. అలా రుద్దిన చపాతీని అతను పెనంపై వేసి వేడి చేస్తున్నాడు. మధ్య మధ్యలో అతడి గుండుపై చపాతీ పిండి వేసి, మరీ ఉండలను రుద్దుతోంది. ఇలా భర్త గుండు చేయించుకోవడం.. ఆమె చపాతీలను చేసేందుకు కలిసొచ్చినట్లైంది.

Viral Video: పాకిస్థాన్‌లో ఇలాక్కూడా చేస్తారా.. కటింగ్ మిషన్‌తో వీరు చేస్తున్న నిర్వాకం చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ చపాతీ పిండిలో ప్రత్యేకంగా ఉప్పు వేయాల్సిన అవసరమే ఉండదు’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ గుండు చపాతీలను తినాలంటే పెద్ద సాహసమే’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.95 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: రైల్లో కిటికీ పక్కన ఫోన్ చూస్తూ యువతి కాలక్షేపం.. అంతలోనే ఎవరూ ఊహించని సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 25 , 2024 | 06:01 PM