Share News

Russian Actress Kamilla: బీచ్‌లో యోగా చేస్తున్న హీరోయిన్‌.. చూస్తుండగానే అలల దాటికి..

ABN , Publish Date - Dec 03 , 2024 | 06:31 PM

బీచ్‌లో యోగా చేయడానికి వెళ్లిన హీరోయిన్ చివరకు విగతజీవిగా తిరిగొచ్చింది. థాయిలాండ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నటి మృతిపై దక్షిణాది సినీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Russian Actress Kamilla: బీచ్‌లో యోగా చేస్తున్న హీరోయిన్‌.. చూస్తుండగానే అలల దాటికి..

బీచ్‌లో యోగా చేయడానికి వెళ్లిన హీరోయిన్ చివరకు విగతజీవిగా తిరిగొచ్చింది. థాయిలాండ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నటి మృతిపై దక్షిణాది సినీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


రష్యన్ నటి అయిన కెమిల్లా బెల్యాట్స్కాయ (24) అనే రష్యన్ నటి (Russian Actress Kamilla) థాయిలాండ్‌లో పర్యటన విషాదాంతంగా ముగిసింది. థాయిలాండ్‌లో పర్యటిస్తున్న ఆమె సుముయ్ ద్వీపం వద్ద యోగా చేసేందుకు వెళ్లింది. బీచ్‌కు దూరంగా తన కారును పార్క్ చేసిన ఆమె.. కూర్చునేందుకు వీలుగా చాపతో సహా బీచ్‌‌ వద్దకు చేరుకుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎత్తుగా ఉన్న ఓ రాయిపై (Yoga on beach) కూర్చుని యోగా చేస్తోంది.


అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద అల రాయిపై కూర్చున్న కెమిల్లాపై పడి.. చివరకు ఆమెను సముద్రంలోకి లాక్కెళ్లింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చాలా మందిని ఆమెను కాపాడేందుకు పరుగులు తీశారు. అయితే ఒక్కసారిగా లోతైన ప్రదేశంలో పడిపోవడంతో కాపాడే అవకాశం కూడా లేకపోయింది. సముద్రంలో కొట్టుకుపోయిన కెమిల్లా.. కొన్ని గంటల తర్వాత శవమై ఒడ్డుకు కొట్టుకొచ్చింది. థాయిలాండ్ పర్యటనలో సంతోషంగా గడుపుతున్న ఆమె.. ఇలా విగతజీవిగా తిరిగిరావడాన్ని ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.


Russian-actress-Kamilla-dea.jpg

నటి కెమిల్లా పలు రష్యన్ సినిమాలతో పాటూ గతంలో ఇండియన్ సినిమాలోనూ నటించి అందరినీ మెప్పించింది. నటుడు, డాన్సర్ అయిన లారెన్స్ తెరకెక్కించిన కాంచన-3 ద్వారా తమిళ ప్రేక్షకులతో పాటూ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైంది. దీంతో కెమిల్లా మృతిపై దక్షిణాదికి చెందిన సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ యోగా చేయడం అలవాటుగా చేసుకున్న కెమిల్లా.. తనకు బాగా ఇష్టమైన ప్రాంతాల్లో ఒంటరిగా యోగా చేయడాన్ని ఇష్టపడతారట. ప్రమాదం జరిగిన ఈ ప్రాంతంలో ఆమె అనేక సార్లు యోగా చేసిందని చెబుతున్నారు. అయితే ఈ సారి థాయ్‌లాండ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయట. దీంతో సముద్రంలో అలలు ఉదృతి ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో బీచ్‌లో పర్యాటకులకు అనుమతిని నిలిపేశారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Updated Date - Dec 03 , 2024 | 06:31 PM