Share News

Viral Video: చెప్పులు కుట్టే వ్యక్తి టాలెంట్‌కు రష్యన్ మహిళ ఫిదా..

ABN , Publish Date - May 22 , 2024 | 02:54 PM

సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా ప్రపంచం మొత్తం వైరల్ అవుతోంది. అంతేకాదు ఎంతో మంది వ్యక్తుల టాలెంట్ బయట ప్రపంచానికి తెలుస్తోంది. సామాన్యమైన వ్యక్తుల్లో ఉంటే నైపుణ్యత బయట వ్యక్తులకు తెలియడానికి సోషల్ మీడియా ఓ సాధనంగా ఉపయోగపడుతోంది.

Viral Video: చెప్పులు కుట్టే వ్యక్తి టాలెంట్‌కు రష్యన్ మహిళ ఫిదా..

సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా ప్రపంచం మొత్తం వైరల్ (Viral) అవుతోంది. అంతేకాదు ఎంతో మంది వ్యక్తుల టాలెంట్ బయట ప్రపంచానికి తెలుస్తోంది. సామాన్యమైన వ్యక్తుల్లో ఉంటే నైపుణ్యత బయట వ్యక్తులకు తెలియడానికి సోషల్ మీడియా (Social Media) ఓ సాధనంగా ఉపయోగపడుతోంది. దేశంలో చెప్పులు కుట్టే వాళ్లను ఎక్కువుగా చూస్తూ ఉంటాం. సరిగ్గా చదువుకోకపోవడం వలన చెప్పులు కుట్టుకుంటున్నారంటూ చాలామంది చులకనగా చూస్తూ ఉంటారు. కాని కొందరు కుల వృత్తిగా చెప్పులు కుడుతూ ఉంటారు. తాజాగా ముంబైలో ఓ చర్మకారుడు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ రష్యన్ మహిళను ఆశ్చర్యపర్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్యన్ మహిళ కొంచెం హిందీలో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ.. చర్మకారుడు రష్యన్ మహిళకు అర్థమయ్యేలా ఆంగ్లంలో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రష్యన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ మరియా చుగురోవా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆమె ముంబై నగరంలో తిరుగుతుండగా చెప్పులు తెగిపోయాయి. దీంతో చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరకు వెళ్లి తన చెప్పులు కుట్టాలని కోరింది. చర్మకారుడు మాట్లాడిన ఇంగ్లీష్ భాషను విని రష్యన్ మహిళ ఆశ్చర్యానికి గురైంది. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తితో జరిగిన సంభాషణను వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Opitcal Illusion: మీ దృష్టి నైపుణ్యానికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉడుత ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి!


వీడియో వైరల్..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రష్యన్ మహిళ వికాస్ అనే చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరకు వెళ్తుంది. అతడితో మాట్లాడుతూ.. ఏన్ని సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నారని మరియా చుగురోవా అడగ్గా.. గత 26 ఏళ్లుగా చెప్పులు కుడుతున్నట్లు వికాస్ తెలిపాడు. ఇదంతా అతను ఇంగ్లీషులో చెప్పిన తీరుకు మరియా ఫిదా అయిపోయింది. చెప్పులు కుట్టినందుకు ఎంత అని అడగ్గా 10 రూపాయిలు అని చెప్పగా.. ఆమె 20 రూపాయిల కాగితం ఇచ్చింది. తిరిగి 10 రూపాయిలు ఇస్తుండగా.. వద్దు ఉంచుకో అంటూ రష్యన్ మహిళ చెప్పడంతో చర్మకారుడు థ్యాంక్స్ చెప్పి 20 రూపాయిలు తీసుకున్నాడు. వికాస్‌తో రష్యన్ మహిళ మాట్లాడుతూ.. మా దేశంలో ఇలాంటి సేవలు అందుబాటులో లేవని.. చెప్పులు తెగిపోతే.. తెగిపోయిన చెప్పులతోనే నడవాలని మరియా తెలిపింది. చెప్పులు కుట్టిన తర్వాత వికాస్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆ మహిళ తన చెప్పులు వేసుకుని ఆనందంతో ముందుకు పరిగెత్తడంతో వీడియో ముగుస్తుంది.


భారీగా వ్యూస్..

ఈ వీడియోను మరియా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది. కష్ట సమయంలో చెప్పులు కుట్టే వ్యక్తి తనకు సహాయం చేశాడని.. చెప్పులు తనను ఇబ్బంది పెట్టినప్పుడు ఓ హీరోలా చెప్పులు కుట్టే వ్యక్తి తనకు సహాయం చేశాడని ఆ పోస్టులో పేర్కొంది. చర్మకారుడు తనను రక్షించాడని.. చాలా థ్యాంక్స్ అంటూ తన పోస్టులో మరియా పేర్కొన్నారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు దాదాపు 5 కోట్ల వ్యూస్ రాగా, చాలా మంది యూజర్లు కామెంట్స్ చేశారు.


Viral Video: ముళ్ల పందిని పట్టుకోబోయి గాయపడిన చిరుత.. తర్వాతేం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే..!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Viral and Telugu News

Updated Date - May 22 , 2024 | 02:55 PM