Share News

Viral Video: ఈ పిచ్చుక మంచి మనసుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

ABN , Publish Date - May 10 , 2024 | 06:39 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి హోటల్లో టీ, బ్రెడ్ తింటుండగా.. ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పిచ్చుక సడన్‌గా ఎగురుకుంటూ టేబుల్ పైకి వస్తుంది. టేబుల్ పక్కనే ఒకరిద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నా కూడా..

Viral Video: ఈ పిచ్చుక మంచి మనసుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

ప్రస్తుత సమాజంలో సాటి మనిషికి సాయం చేసే వారే కరువవుతున్నారు. కష్టాల్లో ఉన్న వారిని చూసి సాయం చేయకపోగా.. మరిన్ని కష్టాలకు గురి చేసే వారే ఎక్కువ కనిపిస్తుంటారు. ఇలాంటి ప్రస్తుత తరుణంలో మన కళ్ల ముందు చోటు చేసుకునే అనేక ఘటనలు అందరికీ కనువిప్పు కలిగిస్తుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పిచ్చుక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పిచ్చుక టేబుల్ పైన చేసిన పని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి హోటల్లో టీ, బ్రెడ్ తింటుండగా.. ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పిచ్చుక (Sparrow) సడన్‌గా ఎగురుకుంటూ టేబుల్ పైకి వస్తుంది. టేబుల్ పక్కనే ఒకరిద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నా కూడా ఆ పక్షి ఏమాత్రం భయపడకుండా దగ్గరికి వచ్చింది. టేబుల్‌పై ఉన్న బ్రెడ్‌లో ముక్కను నోటితో తీసుకుని ఆ పక్కనే ఉన్న మరో పిచ్చుకకు తినిపిస్తుంది. ఇలా పలుమార్లు అక్కడి నుంచి బ్రెడ్ ముక్కలను తీసుకెళ్లి.. తన తోటి పిచ్చుకకు ఎంతో ప్రేమగా తినిపిస్తుంది.

Viral Video: దారికి అడ్డుగా పడుకున్న ఎలిగేటర్లను.. ఈ సైక్లిస్టు ఎలా దాటుకెళ్లాడో చూస్తే..


ఇలా ఆకలితో ఉన్న తోటి పిచ్చుకకు తన వంతు సాయం చేస్తుంది. ఈ పిచ్చుక చేసిన పనికి అక్కడున్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పిచ్చుకది ఎంతో మంచి మనస్సు’’.. అంటూ కొందరు, ‘‘ఈ పిచ్చుకను చూసి ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్.. ఉన్నట్టుండి ఏం జరిగిందో చూస్తే..

Updated Date - May 10 , 2024 | 06:39 PM