Share News

Viral Video: సైకిల్‌ను చోరీ చేసి, గేటు దూకి పోరిపోతున్న దొంగ.. సడన్‌గా పొడవాటి వ్యక్తి ఎంట్రీ.. చివరకు..

ABN , Publish Date - Sep 21 , 2024 | 10:28 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ దొంగ అతి కష్టం మీద ఓ ఇంట్లోకి దూకి సైకిల్‌ను చొరీ చేశాడు. దాన్ని ఎలాగోలా గేటు అవతలి వైపు విసిరేశాడు. దాన్ని తీసుకెళ్లేందుకు ఆ తర్వాత తాను కూడా గేటు దూకేందుకు ప్రయత్నించాడు. అయితే..

Viral Video: సైకిల్‌ను చోరీ చేసి, గేటు దూకి పోరిపోతున్న దొంగ.. సడన్‌గా పొడవాటి వ్యక్తి ఎంట్రీ.. చివరకు..

దొంగలు కొన్నిసార్లు అందరి ముందే ఎంతో తెలివిగా చోరీలు చేస్తుంటారు. మరికొన్నిసార్లు మన కళ్లను మనమే నమ్మలేని విధంగా విలువైన వస్తువులను ఎత్తుకెళ్తుంటారు. అయితే అన్నిసార్లూ ఇలాగే జరుగుతుందా.. అంటే కాదనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక సమయంలో పొరపాట్లు చేస్తాడు. చివరకు ఆ పొరపాట్లే వారి ఒళ్లు హూనం అయ్యేలా చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సైకిల్‌ను చోరీ చేసి గేటు దూకి పారిపోవాలని అనుకున్నాడు. అయితే సడన్‌గా ఓ పొడవాటి వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. చివరకు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ దొంగ అతి కష్టం మీద ఓ ఇంట్లోకి (thief stole bicycle) దూకి సైకిల్‌ను చొరీ చేశాడు. దాన్ని ఎలాగోలా గేటు అవతలి వైపు విసిరేశాడు. దాన్ని తీసుకెళ్లేందుకు ఆ తర్వాత తాను కూడా గేటు దూకేందుకు ప్రయత్నించాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. తీరా గేటు దూకే సమయంలో ఓ పొడవాటి వ్యక్తి ఇంట్లో నుంచి పరుగుపరుగున అక్కడి వచ్చాడు.

Viral Video: రీల్స్ కోసం ఇలా ఎవరైనా చేస్తారా.. బావి పైన కూర్చుని ఈమె చేసిన పని చూడండి..


చూడ్డానికి ఎంతో ఎత్తుతో అచ్చం రెజ్లర్ ది గ్రేట్ ఖలీలా కనిపిస్తున్న అతను.. గేటు దూకబోతున్న దొంగ కాళ్లను పట్టుకుని కిందకు లాగేశాడు. చివరకు బలంగా లాగి కింద పడేశాడు. ఆ తర్వాత అతడిని తన పంచ్‌లతో చితకబాదాడు. అతడి దెబ్బలు తాళలేక ఆ దొంగ కుయ్యో.. మొర్రో.. అంటూ వివిల్లాడిపోయాడు. ‘‘ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను.. నన్ను వదిలేయ్.. బాబూ..’’.. అంటూ కేకలు పెట్టాడు. అయినా ఆ వ్యక్తి మాత్రం అదేమీ పట్టించుకోకుండా దొంగకు దేహశుద్ధి చేశాడు.

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ దొంగకు బాగా జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇంకోసారి ఇలాంటి పని చేయకుండా బాగా చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 21 , 2024 | 10:28 AM