Women: కులాంతర వివాహం చేసుకున్న దంపతులు.. కట్ చేస్తే ఉన్నట్టుండి కారు చోరీ.. చివరకు పోలీసులు విచారించగా..
ABN , Publish Date - Feb 02 , 2024 | 08:00 PM
వారిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. కొన్ని నెలలు సంతోషంగా సాగిన వీరి జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి. నెలలు గడవకుండానే ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు...
వారిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. కొన్ని నెలలు సంతోషంగా సాగిన వీరి జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి. నెలలు గడవకుండానే ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు కారు చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా.. చివరకు షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తిరుపతి జిల్లా (Tirupati District) చంద్రగిరి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాడిపత్రికి చెందిన గ్రానైట్ వ్యాపారి నరేంద్ర నాథ్ రెడ్డి అలియాస్ పవన్ అనే వ్యక్తి.. కొన్నేళ్ల క్రితం అనంతపురానికి చెందిన జయమ్మ(35) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి చరణ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే రవీంద్రారెడ్డికి జయమ్మకు మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నాళ్లకు రెండో వివాహం చేసుకున్నాడు. కొడుకును తీసుకుని తొండవాడలోని విల్లాస్‌లో రెండో భార్యతో కాపురం పెట్టి, బుచ్చినాయుడుపల్లి గ్రామంలో నాటుకోళ్లు, ఆవులు, గొర్రెల ఫాం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది మే 25న జయమ్మ తన కొడుకు కోసం భర్త ఉంటున్న బుచ్చినాయుడుపల్లెకు వచ్చింది. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవ జరిగింది.
Viral Video: చుట్టూ ఐదు కుక్కలు, మధ్యలో భారీ నాగు పాము.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..
అయితే ఆ సమయంలో నరేంద్ర నాథ్ రెడ్డి తన అనుచరులతో కలిసి జయమ్మను హత్య చేసి, మృతదేహాన్ని గుర్తుపట్టకుండా రాజంపేట చెయ్యేరు నది ప్రాంత సమీపంలో పూడ్చేశారు. అప్పట్లో జయమ్మ సోదరుడు దేవేంద్ర ఫిర్యాదు మేరకు అనంతపురం నాల్గవ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే ఈ క్రమంలో జనవరిలో సురేంద్రనాథ్ రెడ్డి కారు చోరీకి గురైంది. దీనిపై అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నరేంద్రనాథ్ రెడ్డి వద్ద పనిచేస్తున్న అప్పారావును అదుపులోకి తీసుకుని విచారించారు. తాము కారు చోరీ చేయలేదని, జయమ్మ హత్య చేసినందకు తమకు ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వకుండా ఆలస్యం చేస్తుండడంతో కారు ఎత్తుకెళ్లామని తెలిపారు. దీంతో పోలీసులు నరేంద్ర నాథ్ రెడ్డితో పాటూ మరో నలుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అయితే జయమ్మను హత్య చేసి 9 నెలల కావడంతో మృతదేహాన్ని గుర్తించడం పెద్ద సమస్యగా మారింది. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.