Share News

Viral Video: గుహలో వీడియో తీసేందుకు వెళ్లగా.. సడన్‌గా ఎలుగుబంటి ఎంట్రీ.. చివరకు అది చేసిన నిర్వాకం..

ABN , Publish Date - Sep 18 , 2024 | 07:06 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వ్లాగ్స్ తీసే క్రమంలో ఛాలెంజ్ కంప్లీట్ చేసేందుకు ఓ ఎలుగుబంటి గుహలోకి వెళ్తాడు. మెడకు, తలకు కెమెరాలు తగిలించుకుని లోపలికి వెళ్లిపోతాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ..

Viral Video: గుహలో వీడియో తీసేందుకు వెళ్లగా.. సడన్‌గా ఎలుగుబంటి ఎంట్రీ.. చివరకు అది చేసిన నిర్వాకం..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది యువకులు వీడియోలు తీయడమే వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యూస్, లైక్‌ల కోసం ఛాలెంజ్‌ల పేరుతో కొందరు ప్రమాదకర ప్రయోగాలు చేయడం కూడా చూస్తున్నాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధిచిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి గుహలో వీడియో తీసేందుకు వెళ్లగా.. సడన్‌గా ఎలుగుబంటి ఎంట్రీ ఇచ్చింది. చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వ్లాగ్స్ (vlogs) తీసే క్రమంలో ఛాలెంజ్ కంప్లీట్ చేసేందుకు ఓ (Bear's Cave) ఎలుగుబంటి గుహలోకి వెళ్తాడు. మెడకు, తలకు కెమెరాలు తగిలించుకుని లోపలికి వెళ్లిపోతాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. గుహ లోపల వివరిస్తూ వీడియో తీస్తుండగా.. బయటికి నుంచి ఏవో శబ్ధాలు వినిపిస్తాయి. ఏంటా అని చూడగా.. అప్పటికే ఎలుగుబంటి గుహ వద్దకు వచ్చి ఉంటుంది.

Viral Video: వామ్మో.. ఈ పులి దొంగలనే మించిపోయిందిగా.. బోనులో పెడితే చివరకు..


ఎలుగుబంటిని చూడగానే అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే ఆ వెంటనే అలెర్ట్ అయిపోతాడు. ఎలాగైనా ఎలుగుబంటి నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో కాసేపు అక్కడే కదలకుండా పడుకుంటాడు. ఎలుగుబంటి లోపలికి రావాలని చూసి.. ఆ వెంటనే మళ్లీ కాస్త వెనక్కు తగ్గుతుంది. అయితే ఎటూ వెళ్లకుండా గుహ ఎంట్రెన్స్ వద్దే ఉంటుంది. అది పక్కకు వెళ్లిపోతుందేమో అని చాలా సేపు ఎదురుచూసినా ఫలితం ఉండదు. దీంతో అతను చివరకు గుహ నుంచి బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఆ వ్యక్తి సమీపానికి రాగానే ఎలుగుబంటి.. ఆశ్చర్యకరంగా ఏమీ అనకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది.

Viral Video: రద్దీ జనం మధ్యలో మహిళ వెనుక నిలబడ్డ యువకుడు.. ఎవరూ చూడలేదు అనుకుని..


అతడి వద్ద ఉన్న కెమెరాను వాసన చూసి వదిలేస్తుంది. దీంతో చివరకు అతను ‘‘బతుకు జీవుడా’’.. అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కంటెంట్ చేయడం కోసం ఇదంతా క్రియేట్ చేసినట్లుగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. ఇతడి టైమ్ బాగుంది కాబట్టి సరిపోయింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 43 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: తేలును మింగాలని చూసిన కట్ల పాము.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 18 , 2024 | 07:11 PM