Share News

Viral Video: బిల్డింగ్‌పై పని చేస్తూ.. వీళ్లు తీసుకున్న జాగ్రత్తలు చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Sep 17 , 2024 | 08:09 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఎత్తైన బిల్డింగ్‌లపై పని చేసే వారు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుని పని చేయడం చూస్తుంటాం. నడుముకు బెల్టులు కట్టుకుని, వాటిని ఇనుప రాడ్లకు తగిలించడం చూస్తుంటాం. ఇప్పుడిదంతా..

Viral Video: బిల్డింగ్‌పై పని చేస్తూ.. వీళ్లు తీసుకున్న జాగ్రత్తలు చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో విచిత్ర నిర్వాకాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు చిత్ర విచిత్రంగా ఆలోచిస్తూ చేసే పనులు.. చివరకు అందరికీ నవ్వు తెప్పిస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఇలాంటి వీడియోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్నిసార్లు అనుకోకుండా ఇలాంటి హాస్య ఘటనలు చోటు చేసుకుంటుంటే.. మరికొన్నిసార్లు ప్లాన్ చేసి మరీ ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఎత్తైన బిల్డింగ్‌పై పని చేస్తూ తీసుకున్న జాగ్రత్తలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఎత్తైన బిల్డింగ్‌లపై పని చేసే వారు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుని పని చేయడం చూస్తుంటాం. నడుముకు బెల్టులు కట్టుకుని, వాటిని ఇనుప రాడ్లకు తగిలించడం చూస్తుంటాం. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా, ఓ వ్యక్తి ఇలాంటి పని చేసే సమయంలో తీసుకున్న జాగ్రత్తలు చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.

Viral Video: బాహుబలి రానాను మించిపోయాడుగా.. మీదకు దూసుకొచ్చిన ఎద్దును ఇతడు ఏం చేశాడో చూడండి..


ఓ యవకుడు బిల్డింగ్‌పై గోడకు వెలుపల (man working on building) నిలబడి పని చేస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. పని చేసే సమయంలో కిందపడిపోకుండా ఉండేందుకు తాళ్లను కట్టుకుంటాడు. అయితే అందరిలా నడుముకు కట్టుకోకుండా మెడకు చుట్టేసుకున్నాడు. పక్కనే ఓ బాలుడు నిలబడి తాళ్లను పట్టుకున్నాడు. అతడు తీసుకున్న జాగ్రత్తలు చూస్తే.. ఒకవేళ కిందపడితే పైగి లాగడం అటుంచి.. అతడి మెడ బిగుసుకుని చనిపోయేలా ఏర్పాట్లు చేసుకున్నాడు.

Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న జింక పిల్ల.. గమనించిన కుక్క.. చివరకు ఏం చేసిందో చూస్తే..


ఇదంతా సరదా కోసం కావాలని చేసినా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చావు తెలివితేటలు అంటే ఇవే’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ‘‘వ్యూస్ కోసం ఇలాంటి పిచ్చి పనులు ఎవరూ చేయకండి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1800కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. లైకుల కోసం లోయలో చున్నీ ఎగరేస్తూ రన్నింగ్ చేయడంతో..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 17 , 2024 | 08:11 PM