Viral Video: కుండపోత అంటే ఇదేనేమో.. 12 సెకన్ల వీడియో చూస్తే..
ABN , Publish Date - Jul 11 , 2024 | 01:56 PM
వర్షాల సీజన్ మొదలవడంతో చాలా ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. అయితే కొన్నిచోట్ల భారీ వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..
ఆకాశానికి చిల్లుపడిందా.. అనే నానుడి నిజమైందా అనిపించేలా ఆశ్చర్యకరమైన ఘటన ఒకటి వెలుగుచూసింది. ఎన్నో ప్రకృతి అందాలను నెటిజన్లకు అందిస్తున్న సోషల్ మీడియా పుణ్యమా అని మరో అద్భుతమైన వీడియో వెలుగుచూసింది. మేఘాలకు చిల్లు పడి.. కొన్ని క్షణాలపాటు నింగి నుంచి నేలకు జలపాతం దూకినట్టుగా కురిసిన వర్షానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుండపోత వర్షం, ఆకాశానికి చిల్లుపడడం అంటే ఇదేనేమో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
సోషల్ మీడియాలో 12 సెకన్ల టైమ్‌లాప్స్ వీడియో (Timelapse Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండు కొండల మధ్యలో పెద్ద సరస్సుతో పాటూ అందమైన చెట్లతో ఆ ప్రదేశం ఎంతో అందంగా ఉంది. అయితే అంత అందమైన ప్రదేశంలో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యే ఘటన చోటు చేసుకుంది. అప్పటికే వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్న ఆ ప్రాంతంలో ఆకాశం మొత్తం మేఘావృతమై ఉంది. అయితే అంతలోనే మేఘాలన్నీ ఒక్కచోటకు చేరాయి. చూస్తుండగానే కొండలకు అటు వైపు నుంచి ఇటు వైపునకు దూసుకొచ్చాయి. వస్తూ వస్తూ తమలో దాచుకున్న నీళ్లన్నింటినీ రెండు కొండల (heavy rain) మధ్య ఒకేసారి కుమ్మరించాయి.
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. నాగుపామును ఒట్టి చేతులతో ఎలా పట్టాడో చూస్తే..
ఈ దృశ్యం చూసేందుకు.. కుండపోత అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. 12 సెకన్ల ఈ టైమ్‌లాప్స్ దృశ్యం చూసేందుకు బాగున్నా.. అదే వర్షం జనావాస ప్రాంతాల్లో పడి ఉంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘వెనిజులా వంటి ప్రాంతాల్లో ఇలాంటి వర్షం 10 నుంచి 15 నిముషాల పాటు కురుస్తుంటుంది’’.. అంటూ కొందరు, ‘‘చూసేందుకు ఎంతో బాగుంది’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: గదిలోకి వెళ్లిన టీచర్‌తో హెచ్ఎం పాడుపని.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు..