Share News

Viral Video: ఎవరి మూడ్ ఎలా ఉంటుందో తెలీదంటే ఇదేనేమో.. వెనుకే వెళ్లి చెవి దగ్గర హారన్ కొట్టగా.. చివరకు..

ABN , Publish Date - Jul 11 , 2024 | 10:54 AM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు విచిత్ర విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే.. మరికొందరు..

Viral Video: ఎవరి మూడ్ ఎలా ఉంటుందో తెలీదంటే ఇదేనేమో.. వెనుకే వెళ్లి చెవి దగ్గర హారన్ కొట్టగా.. చివరకు..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు విచిత్ర విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే.. మరికొందరు ప్రాంక్ వీడియోల పేరుతో జనాలకు షాక్ ఇస్తుంటారు. ఇలాంటి వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నీటి ఒడ్డున నిలబడి ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి వెనుక హారన్ కొట్టగా చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి నది వంతెనపై (River bridge) నిలబడి నీళ్లలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఓ వ్యక్తి ప్రాంక్ వీడియోల (Prank video) పేరుతో అందరి వద్దకు వెళ్లి చెవి దగ్గర హారన్ కొడుతూ ఉంటాడు. ఇలా చివరకు వంతెన వద్ద నిలబడి ఉన్న వ్యక్తి వద్దకు మెల్లగా వెళ్తాడు. సమీపానికి వెళ్లి చెవి వద్ద హారన్ కొడతాడు.

Viral Video: గోర్లు కొరికే అలవాటు ఉందా.. అయితే ఈ వీడియో చూస్తే.. చచ్చినా ఆ పని చేయరు..


హారన్ కొట్టడంతో అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కు చూస్తాడు. అప్పటికే సీరియస్‌గా ఆలోచిస్తున్న అతను.. ఇతను చేసిన పిచ్చి పనికి మరింత ఆగ్రహానికి గురయ్యడు. ముందూ వెనుకూ చూడకుండా అతన్ని చేతులతో పైకి ఎత్తి నీటిలో పడేస్తాడు. ఈ క్రమంలో అతను ‘‘సర్.. సర్.. ఇది ప్రాంక్ సర్.. క్షమించండి’’.. అని అరుస్తున్నా కూడా ఆ వ్యక్తి మాత్రం అదేమీ వినిపించుకోకుండా నీటిలో పడేస్తాడు.

Viral Video: కుక్క, కోడి, కోతి.. కామెడీ మామూలుగా లేదుగా.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..


అయితే అదృష్టవశాత్తు అతడికి ఈత రావడంతో ఎలాగోలా ఈదుకుంటూ బయటికి వస్తాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారికి ఇలాగే జరగాలి’’.. అంటూ కొందరు, ‘‘ప్రాంక్ వీడియోల పేరుతో మరీ అతి చేస్తు్న్నారు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గుడి ముందు పడుకున్న వ్యక్తి.. ఉన్నట్టుండి తల కిందకు దూరిన పాము.. చివరకు..

Updated Date - Jul 11 , 2024 | 11:58 AM