Share News

Viral Video: బైక్ అంటేనే భయం పుట్టేలా చేశాడుగా.. వెనుక కూర్చున్న ఈ యువతి పరిస్థితి చూడండి..

ABN , Publish Date - Oct 23 , 2024 | 10:45 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన బైకుపై యువతిని ఎక్కించుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. కాసేపు బాగా నడిపిన ఆ వ్యక్తి ఆ తర్వాత దెయ్యం పట్టిన వాడిలా ప్రవర్తించాడు. బైకును..

Viral Video: బైక్ అంటేనే భయం పుట్టేలా చేశాడుగా.. వెనుక కూర్చున్న ఈ యువతి పరిస్థితి చూడండి..

ప్రస్తుతం చాలా మంది యువత పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో వివిధ రకాల విన్యాసాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. చాలా మంది బైకుపై ఒళ్ల గగుర్పొడిచే విన్యాసాలను చేయడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో అనేక మంది ప్రమాదాలకు గురై గాయపడడం, ప్రాణాలు కోల్పోవడం కూడా చూస్తుంటాం. అయినా ఎవరిలోనూ మార్పు రావడం లేదు. బైకుపై కూర్చోగానే పూనకం వచ్చినట్లు ఊగిపోతూ చిత్రవిచిత్రంగా నడుపుంటారు. వీరి కారణంగా వెనుక కూర్చున్న వారికి ప్రాణాలు పోయినంత పనవుతుంటుంది. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు బైకు నడిపే విధనాం చూసి ఓ యువతి బెంబేలత్తిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘బైక్ అంటేనే భయం పుట్టేలా చేశాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన బైకుపై యువతిని ఎక్కించుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. కాసేపు బాగా నడిపిన ఆ వ్యక్తి ఆ తర్వాత దెయ్యం పట్టిన వాడిలా ప్రవర్తించాడు. బైకును (bike) చిత్రవిచిత్రంగా నడుపడం స్టార్ట్ చేశాడు. దీంతో అప్పటిదాకా కామ్‌గా ఉన్న యువతి (young woman) కాస్తా.. అతడు బైకు తోలే విధానం చూసి కంగారుపడిపోయింది.

Viral Video: నటనలో ఈ చిరుతకు ఆస్కార్ ఇవ్వొచ్చు.. జింకను ఎలా వేటాడిందో చూస్తే.. అవాక్కవుతారు..


అయినా ఆ వ్యక్తి ఏమాత్రం తగ్గకుండా బైకును రోడ్డుపై అటూ, ఇటూ మళ్లిస్తూ ఓ వైపునకు వాలుస్తూ నడుపుతాడు. ఈ క్రమంలో ఒకానొక దశలో కిందపడిపోయే పరిస్థితి వస్తుంది. అయినా ఎలాగోలా గట్టిగా పట్టుకుని మళ్లీ సరిగా కూర్చుంటుంది. ఇలా ఆ వ్యక్తి చాలా దూరం వరకు బైకును అలాగే ప్రమాదకరంగా నడుపుతూ ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు.

Optical illusion: మీ కంటికి ఇది పెద్ద పరీక్ష.. ఇందులో దాక్కున్న బాతును 15 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


వెనుక మరో వాహనంలో వెళ్తు్న్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇంకోసారి బైకు ఎక్కాలంటేనే భయం పుట్టేలా చేశాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.44 లక్షలకు పైగా లైక్‌లు, 12.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 23 , 2024 | 10:45 AM