Optical illusion: మీ కంటికి ఇది పెద్ద పరీక్ష.. ఇందులో దాక్కున్న బాతును 15 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
ABN , Publish Date - Oct 23 , 2024 | 07:31 AM
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మీకు ఓ తండ్రి, ఇద్దరు పిల్లలు కనిపిస్తుంటారు. చెక్కను ఎలా కత్తిరించాలో తండ్రి తన పిల్లలకు దగ్గరుండి నేర్పిస్తున్నాడు. అయితే ఇదే చిత్రంలో ఓ బాతు కూడా దాక్కుని ఉంది. దాన్ని 15 సెకన్లలో గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లు అర్థం..
సోషల్ మీడియాలో నిత్యం అనేక ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో కాలక్షేపంతో పాటూ మానసినక ఆరోగ్యానికీ ఉపయోగపడే వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు ప్రయత్నించడం వల్ల మనలో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే నిశిత పరిశీలన కూడా అలవాటు అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మీ కోసం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ చిత్రంలో దాక్కున్న బాతును 15 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి.
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మీకు ఓ తండ్రి, ఇద్దరు పిల్లలు కనిపిస్తుంటారు. చెక్కను ఎలా కత్తిరించాలో తండ్రి తన పిల్లలకు దగ్గరుండి నేర్పిస్తున్నాడు. పిల్లలేమో ఎదురెదురుగా నిల్చుని చెక్కను పట్టుకుని, తండ్రి చెప్పిన మాటలను శ్రద్ధగా వింటున్నారు. ఆ పక్కనే వారి పెంపుడు కుక్క అటూ, ఇటూ తిరుగుతూ వారి దృష్టిని ఆకర్షిస్తోంది.
Viral Video: ఆహా..! ఇతడి టెక్నిక్ మామూలుగా లేదుగా.. ట్రాఫిక్ పోలీసులకు దొరక్కుండా ఏం చేశాడంటే..
కుక్క చేస్తున్న పనులను చూసి వారు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వారితో పాటూ అనేక వస్తువులు కనిపిస్తుంటాయి. అదేవిధంగా ఓ పెద్ద వృక్షాన్ని కూడా చూడొచ్చు. ఎంత సేపు గమనించినా ఈ చిత్రంలో ముగ్గురు వ్యక్తులు, ఓ కుక్క తప్ప.. ఎలాంటి జీవులూ లేటన్లు అనిపిస్తుంది. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇదే చిత్రంలో ఓ బాతు కూడా ఉంది. కానీ అది మీ కంటికి కనిపించకుండా దాక్కుని (hiding duck) ఉందన్నమాట. ఇందులో బాతు ఎక్కడుందే.. ఉండడానికి ఛాన్సే లేదే.. అని అనుకుంటున్నారా.. మీలాగే చాలా మంది ఇలాగే అనుకుంటున్నారు.
Optical illusion: ఇందులో మీరు మొదట ఏదైతే చూశారో.. దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి..
కానీ మీ చూపును ఈ చిత్రంపై నిలిపి నిశితంగా పరిశీలిస్తే.. ఆ బాతును గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు. చాలా మంది ఆ బాతును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారిలో కేవలం కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ బాతు ఎక్కడుందో గుర్తించేందుకు ప్రయత్నించండి. మీకు 15 సెకన్ల సమయం ఇస్తున్నాం.. ఈలోపు గుర్తించారంటే మీ చూపు చురుగ్గా ఉండడంతో పాటూ మీలో నిశిత పరిశీలన ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.
ఒకవేళ ఇప్పటికీ ఆ బాతును గుర్తించడం మీ వల్ల సాధ్యం కాకపోతే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోండి..
Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..