Share News

Viral Video: ఆహా..! ఇతడి టెక్నిక్ మామూలుగా లేదుగా.. ట్రాఫిక్ పోలీసులకు దొరక్కుండా ఏం చేశాడంటే..

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:50 PM

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద, వాహనాల తనిఖీల సమయాల్లో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొందరు సిగ్నల్ జంపింగ్ చేస్తుంటే.. మరికొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వివిధ రకాలుగా ఆలోచిస్తుంటారు. చివరకు వారు చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి..

Viral Video: ఆహా..! ఇతడి టెక్నిక్ మామూలుగా లేదుగా.. ట్రాఫిక్ పోలీసులకు దొరక్కుండా ఏం చేశాడంటే..

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద, వాహనాల తనిఖీల సమయాల్లో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొందరు సిగ్నల్ జంపింగ్ చేస్తుంటే.. మరికొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు వారు చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ట్రాఫిక్ పోలీసులకు దొరక్కుండా ఓ యువకుడు చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఆహా..! ఇతడి టెక్నిక్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బైక్ డ్రైవింగ్ సమయంలో కొందరు యువకులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. పోలీసులు (traffic police) కనపడితే చాలు దూరంలోనే బైకులు ఆపకోవడం లేదా వేరే మార్గంలో వెళ్లడం చేస్తుంటారు. అలాగే పోలీసులు గమనించిన సమయాల్లో వారికి దొరక్కుండా వేగంగా దూసుకెళ్తుంటారు.

Viral Video: పోస్టుమార్టం చేస్తున్నప్పుడు శవం కదలుతుందా.. అన్న ప్రశ్నకు.. ఈమె సమాధానం వింటే పగలబడి నవ్వాల్సిందే..


ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలను నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు.. పోలీసులకు దొరక్కుండా చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. స్కూటీపై వెళ్తున్న అతను.. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారని తెలుసుకుని సడన్‌గా బండిని ఆపేశాడు. కిందకు దిగి స్కూటీని తోసుకుంటూ వెళ్లాడు. పోలీసుల పక్క నుంచే తోసుకుంటూ వెళ్తున్నాడు. అయినా పోలీసులు అతన్ని ఏమీ అనలేదు. దీంతో అతను స్కూటీని తోసుకుంటూ సంబరంగా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాడు.

Optical illusion: ఇందులో మీరు మొదట ఏదైతే చూశారే.. దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి..


అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత యథావిధిగా స్కూటీపై కూర్చుని రయ్యిన దూసుకెళ్లాడు. దీంతో అప్పటిదాకా అతన్ని గమనిస్తున్న వారంతా.. ఈ సీన్ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘మొత్తానికి పోలీసులనే ఫూల్స్ చేశాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4వేలకు పైగా లైక్‌లు, 3.68 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇతను భవిష్యత్తులో పెద్ద ఇంజినీర్ అవడం పక్కా.. చెప్పుల్లో ఇలాంటి టెక్నాలజీ ఎక్కడైనా చూశారా..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 22 , 2024 | 01:50 PM