Share News

Viral Video: ప్రియుడి ఆచూకీ చెప్పాలంటూ యువకుడిని బెదిరించిన యువతి.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Oct 06 , 2024 | 04:15 PM

ఓ యువతి చేసిన విచిత్ర నిర్వాకం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సదరు యువతి తన ప్రియుడి కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే అతను ఆమెకు కనిపించకుండా దాక్కుని ఉంటాడు. దీంతో ఆమె చాలా చోట్ల వెతికి చివరకు..

Viral Video: ప్రియుడి ఆచూకీ చెప్పాలంటూ యువకుడిని బెదిరించిన యువతి.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

సినిమాలకు ఎలాగైతే స్ర్కిప్ట్‌లు రెడీ చేసుకుంటారో.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది వీడియోలకూ అలాగే స్ర్కిప్ట్‌లు రెడీ చేసుకుంటుంటారు. కొందరు మిగతా వారికి భిన్నంగా ప్లాన్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. ఇంకొందరు సినిమాలకు మించిన ట్విస్ట్‌లో కొత్త కొత్త రీల్స్ చేస్తూ అందరినీ తెగ నవ్విస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి తన ప్రియుడి ఆచూకీ చెప్పాలంటూ కర్ర తీసుకుని వెళ్లి మరీ ఓ యువకుడిని బెదిరిస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) చేసిన విచిత్ర నిర్వాకం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సదరు యువతి తన ప్రియుడి (boyfriend) కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే అతను ఆమెకు కనిపించకుండా దాక్కుని ఉంటాడు. దీంతో ఆమె చాలా చోట్ల వెతికి, చివరకు ఓ చెరువు ఒడ్డున ఉన్న ప్రియుడి స్నేహితుడి వద్దకు వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ చేతిలో పెద్ద కర్ర పట్టుకుని వెళ్తుంది. అతడి వద్దకు వెళ్లి కర్రతో అతన్ని గట్టిగా బెదిరిస్తుంది.

Viral Video: వామ్మో.. వీడేంట్రా.. మరీ ఇలా ఉన్నాడు.. రోటీ మధ్యలో పేడ ఉంచి మరీ..


తన ప్రియుడు ఎక్కడ ఉన్నాడో.. చెప్పాలంటూ నిలదీస్తుంది. కర్రతో కొట్టాలని చూడగా... అతను భయంతో ఆమె ప్రియుడు ఎక్కడ ఉన్నాడో చెప్పేస్తాడు. నీళ్లలో దాక్కుని ఉన్నట్లు చెప్పగానే.. చెరువులోకి వెళ్లి నీళ్లలో పడుకుని ఉన్న ప్రియుడి జుట్టును పట్టుకుని పైకి లాగుతుంది. ఇలా నీళ్లలో పడుకుని ఉన్న అతన్ని బయటికి లాక్కుని వస్తుంది. ఆ సమయంలో అతడు ఆమె దెబ్బకు భయంతో వణికిపోతూ ఉంటాడన్నమాట.

Viral Video: లారీనే ఢీకొట్టాలని చూసిన ఖడ్గమృగం.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..


చూస్తుంటే ఇదంతా వైరల్ అవ్వాలనే ఉద్దేశంతోనే చేసినట్లుగా ఉన్నా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రియుడికి ఈ యువతి బాగా బుద్ధి చెప్పిందిగా’’.. అంటూ కొందరు, ‘‘అంతా ఎంతో బాగా నటించారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 34 వేలకు పైగా లైక్‌లు, 2.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కోబ్రాను చుట్టేసిన కొండచిలువ.. చివరకు ఏమైందో చూస్తే.. షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 06 , 2024 | 04:15 PM