Share News

Viral Video: ఈ ఆటో డ్రైవర్ క్రియేటివిటీ మామూలుగా లేదుగా.. ముందు వైపు నుంచి చూడగా.. అవాక్కయ్యే సీన్..

ABN , Publish Date - Oct 04 , 2024 | 08:17 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై రాత్రి వేళ దూసుకెళ్తున్న ఓ ఆటోను చూసి అంతా చూపు తిప్పుకోలేకున్నారు. అలాగని ఆ ఆటోలో మరీ ఖరీదైన ఏర్పాట్లు కూడా ఏవీ లేవు. అయినా అంతా ఆ ఆటోను తదేకంగా చూస్తూ, ఆటో డ్రైవర్‌ను ప్రశసంసిస్తున్నారు. ఆటో అద్దంపై...

Viral Video: ఈ ఆటో డ్రైవర్ క్రియేటివిటీ మామూలుగా లేదుగా.. ముందు వైపు నుంచి చూడగా.. అవాక్కయ్యే సీన్..

విచిత్ర వాహనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. కొందరు సైకిళ్లను బైకుల్లా, బైకులను ఆటోల తరహాలో మార్చడం చూస్తుంటాం. అలాగే మరికొందరు తమ ఆటోలను చిత్రవిచిత్రంగా మారుస్తుంటారు. కొందరు ఆటో వెనుక వింత వింత కొటేషన్లు రాసి అందరినీ ఆకట్టుకుంటుంటే.. ఇంకొందరు ఆటోలపై విచిత్ర డిజైన్లు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి ఆటోకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఆటో డ్రైవర్ క్రియేటివిటీ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై రాత్రి వేళ దూసుకెళ్తున్న ఓ ఆటోను చూసి అంతా చూపు తిప్పుకోలేకున్నారు. అలాగని ఆ ఆటోలో మరీ ఖరీదైన ఏర్పాట్లు కూడా ఏవీ లేవు. అయినా అంతా ఆ ఆటోను తదేకంగా చూస్తూ, ఆటో డ్రైవర్‌ను ప్రశసంసిస్తున్నారు. ఆటో అద్దంపై అతడు వేయించిన డిజైనే ఇందుకు కారణం.

Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం.. తన ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ..


ఆటో అంతా సాధారణంగానే ఉన్నా కూడా.. ముందు వైపు (Batman sticker on auto mirror) అద్దంపై బ్యాట్ మ్యాన్ ఆకారంలో స్టిక్కరింగ్ చేయించాడు. అలాగే ముందు వైపు లైట్లు వినూత్నంగా వెలిగేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఫైనల్‌గా ఈ ఆటోను ముందు వైపు నుంచి చూసిన వారికి.. బ్యాట్ మ్యానే ఆటో నడుపుతున్నట్లుగా కనిపిస్తుంది. రోడ్డుపై దూసుకెళ్తున్న ఈ ఆటోను అంతా విచిత్రంగా చూస్తున్నారు.

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..


కొందరు ఈ ఆటోను ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇలా వినూత్నంగా ఆలోచించిన ఈ ఆటో డ్రైవర్ వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బ్యాట్ మ్యాన్ ఈ ఆటోలో బతికే ఉన్నాడు’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 65 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ సింహాలు సినిమాలు చూసి అప్డేట్ అయ్యాయేమో.. దాడి చేయడంలో ఎలాంటి స్కెచ్ వేశాయో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 04 , 2024 | 08:17 PM