Share News

Viral Video: ఈ సింహాలు సినిమాలు చూసి అప్డేట్ అయ్యాయేమో.. దాడి చేయడంలో ఎలాంటి స్కెచ్ వేశాయో చూస్తే..

ABN , Publish Date - Oct 04 , 2024 | 05:22 PM

‘‘కండ బలం కంటే బుద్ధి బలం గొప్పది’’.. అన్న సామెత చందంగా శక్తియుక్తులతో చేయలేని ఎన్నో పనులను.. తెలివితేటలతో సులభంగా చేసెయ్యొచ్చు. ఇందకు నిదర్శంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మనుషుల విషయంలోనే కాకుండా కొన్నిసార్లు జంతువుల విషయంలోనూ..

Viral Video: ఈ సింహాలు సినిమాలు చూసి అప్డేట్ అయ్యాయేమో.. దాడి చేయడంలో ఎలాంటి స్కెచ్ వేశాయో చూస్తే..

‘‘కండ బలం కంటే బుద్ధి బలం గొప్పది’’.. అన్న సామెత చందంగా శక్తియుక్తులతో చేయలేని ఎన్నో పనులను.. తెలివితేటలతో సులభంగా చేసెయ్యొచ్చు. ఇందకు నిదర్శంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మనుషుల విషయంలోనే కాకుండా కొన్నిసార్లు జంతువుల విషయంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైల్డ్ బీస్ట్‌ను వేటాడే క్రమంలో సింహాలు వేసిన స్కెచ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ సింహాలు సినిమాలు చూసి అప్‌డేట్ అయ్యాయేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని (South Africa) క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లోని ఫిండా ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని సింహాలు కలిసి వేట కోసం వెతుకుతూ ఉంటాయి. ఈ క్రమంలో వాటికి దూరంగా కొన్ని వైల్డ్ బీస్ట్‌లు నడుస్తూ రావడం కనిపిస్తుంది. దీంతో ఎలాగైనా వాటిలో ఒకదాన్నైనా వేటాడాలని నిర్ణయించుకుంటాయి. అయితే ఇందుకోసం నేరుగా వాటిపైకి దాడి చేయకుండా.. తమ ప్లాన్ మారుస్తాయి. రొటీన్‌కు పూర్తి భిన్నంగా మాస్టర్ ప్లాన్ వేస్తాయి.

Optical illusion: చురుకైన చూపు ఉన్న వారు మాత్రమే.. ఈ సరస్సులో దాక్కున్న మొసలిని 20 సెకన్లలో కనుక్కోగలరు..


కొన్ని సింహాలు రోడ్డుపై వాటికి ఎదురుగా పడుకుని నక్కి నక్కి చూస్తుంటాయి. ఈ క్రమంలో వాటిలో ఓ సింహం.. రోడ్డు పక్కగా వెళ్లి పొదల్లో దాక్కుని ఉంటుంది. రోడ్డు మధ్యలో పడుకున్న సింహాలు.. దూరం నుంచి వస్తున్న వైల్డ్ బీస్ట్‌లను గమనిస్తుంటాయి. సింహాలను గమనించని వైల్డ్ బీస్ట్‌లు.. తాపీగా నడుచుకుంటూ వస్తుంటాయి. అయితే కాస్త దూరం రాగానే పొదల్లో ఉన్న సింహం.. ఒక్కసారిగా వాటి పైకి దూకేస్తుంది. సింహం దాడి చేయడంతో (lions attacked the wild beast) వైల్డ్ బీస్ట్‌లు తలోదారికి పారిపోతాయి. అయితే చివరకు ఒక వైల్డ్ బీస్ట్‌పై దాడి చేసి కింద పడేస్తాయి. ఇంతలో రోడ్డుపై పడుకున్న సింహాలు పరుగెత్తుకుంటూ వెళ్తాయి. అన్నీ కలిసి వైల్డ్ బీస్ట్‌ను కిందపడేసి చంపేస్తాయి.

Viral Video: వధువుతో డాన్స్ చేస్తున్న వరుడు.. సడన్‌గా ఫ్యాంట్ చూసుకుని షాక్.. చివరకు..


ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది. కొందరు ఈ ఘటననను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహాల స్కెచ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘సింహాల టీమ్ వర్క్ బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 2.2 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తాబేలు, కుందేలు మధ్య పోటీ.. మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 04 , 2024 | 05:22 PM